ఏపీలో ఘోర ప్రమాదం.. కారు కాల్వలోకి దూసుకెళ్లి ముగ్గురు మృతి..
పశ్చిమగోదావరి జిల్లా పోడూరు మండలం జగన్నాథపురం సమీపంలో బుధవారం(మార్చి 4)న ఘోర ప్రమాదం జరిగింది. అటుగా వెళ్తున్న ఓ కారు అదుపు తప్పి రోడ్డు పక్కనున్న పంట కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. నరసాపురం నుంచి రాజమండ్రికి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.

Recommended Video

Hersis Virus : New Virus In Andhra Pradesh ! | Oneindia Telugu
మృతులంతా యలమంచిలి మండలం కాజ గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని స్థానికుల సహాయంతో కారును బయటకు వెలికితీశారు. తెల్లవారుజామున కారు నడుపుతున్న సమయంలో డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.












Click it and Unblock the Notifications