కాంగ్రెస్‌కు షాక్: టిడిపిలోకి ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ముగ్గురు శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. లోక్‌సభలో రాష్ట్ర విభజన బిల్లు ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్‌కు చెందిన సీమాంధ్ర శానససభ్యులు బండారు సత్యానందరావు, ఆదాల ప్రభాకరరెడ్డి, శ్రీధర కృష్ణారెడ్డి గురువారం పార్టీకి రాజీనామా ప్రకటించిన విషయం తెలిసిందే.
ఆ ముగ్గురు శాసనసభ్యులు కూడా తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. వీరిలో బండారు సత్యానందరావు, ఆదాల ప్రభాకరరెడ్డి శుక్రవారం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును ఆయన నివాసంలో కలిసి మాట్లాడారు.

తాడేపల్లిగూడెంలో శనివారం జరగనున్న బహిరంగ సభలో చంద్రబాబు సమక్షంలో బండారు సత్యానందరావు టిడిపిలో చేరనున్నారు. అంతకు ముందు తెలుగుదేశం పార్టీ తరఫున తూర్పు గోదావరి జిల్లాలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బండారు సత్యానందరావు చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించడంతో అందులో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు.
ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడంతో ఆయన కాంగ్రెస్‌లో కొనసాగుతూ వచ్చారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఆదాల, శ్రీధర కూడా గతంలో టీడీపీనుంచి బయటకు వెళ్లినవారే. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మాజీ శాసనసభ్యుడు కొట్టు సత్యనారాయణ కూడా శుక్రవారం చంద్రబాబును కలిసి ఆ పార్టీలో చేరాలనుకుంటున్నట్లు తెలిపారు. ఆయన పది రోజుల్లో ఆ పార్టీలో చేరబోతున్నారని సమాచారం.












Click it and Unblock the Notifications