'బంగారు తల్లి' మృతి: సహాయ చర్యల్లో ఎమ్మార్వో మృతి
నిజామాబాద్/ఏలూరు: రచ్చబండ కార్యక్రమంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లా మాచారెడ్డి మండలంలో ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో బంగారు తల్లి దరఖాస్తుల కోసం భారీగా జనం ఎగబడ్డారు. రేణుక అనే మహిళ తన మూడు నెలల పాప మోక్షతో కలిసి వచ్చింది.
దరఖాస్తు నమోదు చేయుంచుకోవడం కోసం జనం ఎగబడిన క్రమంలో రేణుక కూతురు మోక్షకు ఊపిరి ఆడలేదు. దీంతో ఆ చిన్నారి మృతి చెందినట్లుగా తెలుస్తోంది. బాధితులు భవానీపేట తండాకు చెందిన వారు.

తహసీల్దారు మృతి
హెలెన్ తుఫాను సహాయక చర్యల్లో పాల్గొనేందుకు వెళ్తున్న తహసీల్దారు ప్రమాదంలో మృతిచెందారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం బట్లమగుటూరు వద్ద తహసీల్దారు సత్యనారాయణ కారు చెట్టుకు ఢీకొంది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు.
తుఫాను గాలుల వల్ల విరిగిన చెట్లు రోడ్డుకు అడ్డంగా పడిపోయి ఉన్నాయి. వెనుక నుండి లారీ వస్తుండటం, దగ్గరలో మలుపు ఉండటంతో కారు చెట్టుకు ఢీకొంది. కాగా, హెలెన్ తుఫాను కోస్తాంధ్ర ప్రాంతాన్ని వణికిస్తున్న విషయం తెలిసిందే. హెలెన్ తుఫాను కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 7గురు మృతి చెందినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications