ఏపీలో 'మూడు'పై జోరుగా చర్చ... మూడు పెళ్ళిళ్ళు ఓకే కానీ మూడు రాజధానులు వద్దా !! పవన్ పై సెటైర్లు
ఏపీలో సీఎం జగన్ మోహన్ రెడ్డి చేసిన మూడు రాజధానుల ఏర్పాటుపై సూచనప్రాయంగా చేసిన ప్రకటనతో ఇప్పుడు ఏపీలో 3పై ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఏపీ రాజకీయమంతా ఈ మూడు చుట్టూనే తిరుగుతుండడం విశేషం. సీఎం జగన్ మోహన్ రెడ్డి రాజధానిపై జరిగిన చర్చలో చేసిన వ్యాఖ్యల దుమారం ఇప్పుడు మూడు నెంబర్ పై ఏపీలో పెద్ద చర్చకు కారణం అవుతుంది. మొన్నటి వరకు టీడీపీ 23 నెంబర్ పై చర్చ జరగగా ఇప్పుడు మూడు నెంబర్ హాట్ టాపిక్ గా మారింది.

మూడు ప్రాంతాలవారికి న్యాయం జరిగేలా జగన్ నిర్ణయమని చర్చ
మూడు ప్రాంతాల వారిని సంతోష పెట్టాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి 3 రాజధానుల నిర్ణయం తీసుకున్నారని ఒక వర్గం పేర్కొంటుంది. కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల ప్రజలను సంతోష పెట్టాలని, మూడు ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా చేసుకొని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారని అభిప్రాయపడుతున్నారు. ఏపీ లోని మూడు ప్రాంతాలలో అనంతపురం నుంచి కర్నూలు వరకూ నాలుగు జిల్లాలతో కలిపిన ప్రాంతాన్ని రాయలసీమగా.. నెల్లూరు మొదలుకొని గోదావరి జిల్లాల వరకూ కోస్తాగా.. విశాఖ నుంచి శ్రీకాకుళం వరకూ ఉన్న ప్రాంతాన్ని ఉత్తరాంధ్రగా చెప్తుంటారు. మూడు ప్రాంతాలతో కలిసిన రాష్ట్రంగా ఉన్నా ఏపీలో జగన్ 3 రాజధానుల నిర్ణయం సరైనదని కొందరు అభిప్రాయపడుతున్నారు .

ఏపీలో ముగ్గురు కీలక నేతలు ... రాజకీయాలను రక్తి కట్టిస్తుంది వారే
ఇక ఏపీ రాజకీయాలలో ముగ్గురు ముఖ్య నేతలు ఉన్నారని మూడు ఏపీకి బాగా కలిసి వచ్చిందని మాట్లాడుకుంటున్న వారు కూడా లేకపోలేదు. ఏపీలోని ముగ్గురు ముఖ్య నేతల్లో ఒకరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అయితే, మరొకరు టిడిపి అధినేత మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, ఇక ఇంకొక కీలకనేత జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈ ముగ్గురు ప్రస్తుత ఏపీ రాజకీయాలను రక్తి కట్టిస్తున్నారు. మాటల తూటాలను పేలుస్తూ ఏపీలో రాజకీయ వేడి రగిలిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ టార్గెట్ గా మూడు పెళ్ళిళ్ళపై సెటైర్లు వేస్తున్న నెటిజన్లు
ఇక అంతే కాదు ఏపీలో ఈ మూడు పై మరో ఆసక్తికర చర్చ కూడా జరుగుతోంది. మూడు రాజధానులు ప్రకటన తర్వాత పవన్ కళ్యాణ్ వరసగా ట్వీట్లు చేశారు. మూడు రాజధానులు అవసరమా అని ప్రశ్నించారు. నిపుణుల కమిటీ నివేదిక రాకముందే సీఎం జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల ప్రకటన ఎందుకు చేశారని నిలదీశారు. దీంతో పవన్ కళ్యాణ్ టార్గెట్ గా సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శలు గుప్పించారు.

మూడు పెళ్ళిళ్ళు ఓకే కానీ మూడు రాజధానులు వద్దా అంటూ విమర్శలు
తినడానికి తిండి లేక తండ్రి ఏడుస్తుంటే, కొడుకు వచ్చి పరమాన్నం అడిగాడట. అలాగా, ఒక్క అమరావతి రాజధానికే దిక్కు దివాణం లేదు ఇప్పటి దాక.. మరి జగన్ రెడ్డికి మూడు అమరావతి నగరాలు అసలు అయ్యేనా? అని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో రచ్చ కొనసాగింది..పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్న ఓకే కానీ మూడు రాజధానులు వద్దంటూ మరోమారు పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల విషయాన్ని ప్రస్తావనకు తెచ్చారు. దీంతో ఏపీలో ఇప్పుడు 3 నెంబర్ పై జరుగుతున్న రాజకీయం హాట్ టాపిక్ గా మారింది. మొన్నటివరకు ఏపీలో 23 నెంబర్ పై చర్చ జరగగా ఇప్పుడు తాజా రాజకీయ పరిణామాలలో మూడుపై చర్చ జరుగుతుంది.












Click it and Unblock the Notifications