క్రిస్మస్ వేడుకల వేళ ప.గో జిల్లాలో తీరని విషాదం.. ముగ్గురు స్పాట్ డెడ్ !!
ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కానీ క్రిస్మస్ వేడుకలు ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తున్న యువకులు తిరిగిరాని లోకాలకు చేరడం తీరని శోకాన్ని మిగులుస్తుంది. ఈ విషాద ఘటన ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. దీంతో ఈ వ్యవహారం సర్వత్రా ఆందోళన నింపుతోంది.
అసలు ఏం జరిగిందంటే..?
పెనుమంట్ర మండలం పోలమూరు సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అతి వేగంతో వెళ్తున్న ద్విచక్ర వాహనం అదుపు తప్పి రోడ్డు డివైడర్‌ను ఢీకొనడంతో ముగ్గురు యువకులు సంఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే స్పందించి వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించినప్పటికీ.. అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఈ ప్రమాదంలో మృతి చెందిన యువకులను.. సత్య నారాయణ, అంజిబాబు, రాజుగా గుర్తించారు. ముగ్గురు కూడా ఒకే గ్రామానికి చెందినవారు కావడంతో పోలమూరు గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. చనిపోయిన వారి కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమవుతున్నారు. క్రిస్మస్ వేడుకల అనంతరం తిరిగి ఇంటికి వెళ్తున్న తరుణంలో ఈ ఘటన జరిగినట్టు చెబుతున్నారు.
ఒకేసారి ముగ్గురు యువకులు మృతి చెందడంతో పోలమూరు గ్రామం మొత్తం శోకసంద్రంగా మారింది. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో మృతదేహాల వద్దకు చేరుకుని కుటుంబాలకు ఓదార్పు తెలిపారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తి వివరాలు సేకరించి.. కేసు నమోదు నమోదు చేసినట్టు వెల్లడించారు. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.
ఈ ఘటన మరోసారి రోడ్డు భద్రత, అతి వేగం వల్ల కలిగే ప్రమాదాలపై తీవ్ర హెచ్చరికగా మారింది. ముఖ్యంగా పండుగ రోజులలో యువత నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం ఎంతటి ప్రమాదాలకు దారితీస్తుందోనని స్పష్టం అవుతోంది. అయితే అధిక వేగం, అజాగ్రత్త కారణం గానే ప్రమాదం జరిగి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రత్యేకంగా విద్యార్థులు, యువత ప్రయాణించే సమయంలో వేగం పై నియంత్రణ పాటించాలని, కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తగా ప్రయాణించాలని పోలీసులు సూచించారు.












Click it and Unblock the Notifications