గ‌న్న‌వ‌రం ఎయిర్‌పోర్టులో మూడు విమానాలు అత్య‌వ‌స‌ర ల్యాండింగ్‌..

అటు తెలంగాణ‌లోనూ, ఇటు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనూ ద‌ట్ట‌మైన‌ పొగ‌మంచు క‌మ్మేస్తోంది. మంచు కార‌ణంగా రోడ్ల‌పై వెళ్లే వాహ‌నాల‌కు తీవ్ర అంత‌రాయం క‌లుగుతుంది. వాహ‌నాదారులు కూడా అనేక స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్నారు. మంచు ప్ర‌భావంతో విమానాల రాక‌పోక‌ల‌కు కూడా అంత‌రాయం ఏర్ప‌డింది. మంచు కార‌ణంగా వాత‌వ‌ర‌ణం అనుకూలించ‌క‌పోవ‌డంతో గ‌న్న‌వ‌రం విమాన‌శ్ర‌యంలో మూడు విమానాలు ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వ‌చ్చింది.

ఈ విమానాలు చండీఘర్ నుంచి హైదరాబాద్, గోవా నుంచి హైదరాబాద్, తిరువనంతపురం నుంచి హైదరాబాద్‌కు రావల్సిన‌వి. అత్య‌ధికంగా మంచు కార‌ణంగా ఈ మూడు విమానాలను అత్యవసరంగా గన్నవరం ఎయిర్‌పోర్టులో ల్యాండ్ చేశారు. ఒక్కో విమానంలో సుమారు 165 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. ఎమర్జెన్సీ ల్యాండింగ్‌తో ప్ర‌యాణికులు కాస్త ఆందోళ‌న‌ల‌కు గుర‌వుతున్న‌ట్లు స‌మాచారం.

Three planes made an emergency landing at Gannavaram airport.

ప‌లు విమానాల‌ను దారి కూడా మ‌ళ్లించారు : కేవ‌లం హైద‌రాబాద్‌లోనే కాకుండా ఢిల్లీలో కూడా ద‌ట్ట‌మైన పొగ‌మంచు క‌మ్మేసింది. దీంతో వాతావ‌ర‌ణం అనుకూలించ‌క పోవడంతో మరికొన్ని విమానాలను దారి కూడా మ‌ళ్లించారు. ఉదయం 07:35 గంటలకు మస్కట్ నుంచి శంషాబాద్ రావాల్సిన ఒమాన్ ఎయిర్‌లైన్స్‌ విమానాన్ని బెంగళూరుకు దారి మళ్లించ‌డం జ‌రిగింది. అలాగే, ఉదయం 8:05 గంటలకు రియాద్ నుంచి రావలసిన విమానం, ఉదయం 9:10 గంటలకు జెడ్డా నుంచి రావాల్సిన విమానాలను బెంగళూరుకు దారి మళ్లించారు. పలు విమానాలు బెంగళూరు, నాగపూర్‌కు దారి మళ్లించినట్లు అధికారులు వివ‌రించారు.

మంచు ప్రభావంతో జాతీయ రహదారులపై ప్రయాణికులు కోల్‌కతా రహదారిపై కూడా పలు ప్రాంతాల్లో డ్రైవర్లు వాహనాలను నిలిపివేయ‌డం జ‌రిగింది. ఎదురుగా వచ్చే, వెళ్ళే వాహనాలు కనిపించకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై జగ్గయ్యపేట ప్రాంతంలో పొగ మంచు విప‌రీతంగా ఉంది. దాంతో విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే వాహ‌నాదారులు, జాతీయ రహదారిపై అనేక ఇబ్బందులకు గుర‌వుతున్నారు. ఇక‌, కొన్ని ప్రాంతాల్లో అయితే వాహ‌న‌దారులు జాతీయ రహదారి పక్కన టీ స్టాల్స్, హోటళ్ళు వద్ద వాహనాలు నిలిపివేస్తున్నారు. మంచు కార‌ణంగా కొన్ని జాతీయ ర‌హ‌దారుల‌పై యాక్సిడెంట్లు జ‌రిగే అవ‌కాశం కూడా ఉంటుంది. అందుకే వాహ‌న‌దారులు ర‌హ‌దారి ప‌క్క‌న వాహానాల‌ను నిలిపివేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+