దాచేపల్లి ఘటన: సుబ్బయ్యకు రెండు పెళ్ళిళ్ళు, మానసిక వైకల్యంతోనే దారుణం: డీజీపీ
Recommended Video

గుంటూరు: గుంటూరు జిల్లా దాచేపల్లిలో మైనర్‌బాలికపై అత్యాచారానికి పాల్పడిన 50 ఏళ్ళ సుబ్బయ్య కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టినట్టు ఏపీ డీజీపీ మాలకొండయ్య చెప్పారు. మానసిక వైకల్యంతోనే సుబ్బయ్య ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని డీజీపీ అభిప్రాయపడ్డారు.
దాచేపల్లి ఘటనపై గురువారం సాయంత్ర అమరావతిలో మీడియాతో మాట్లాడారు. దాచేపల్లి ఘటనలో ఇవాళ ఉదయం నుండి చోటు చేసుకొన్న ఘటనలపై పోలీసులు సంయమనంతో వ్యవహరించారని ఆయన చెప్పారు. దాచేపల్లిలోని ఐజీ, ఎస్పీ , పోలీసులు ఉన్నారని ఆయన చెప్పారు.

దాచేపల్లిలో మైనర్‌బాలికపై అత్యాచారానికి పాల్పడిన 50 ఏళ్ళ సుబ్బయ్య గతంలో రెండు వివాహలు చేసుకొన్నారని డీజీపీ చెప్పారు. అయితే ఇద్దరు భార్యలను కూడ సుబ్బయ్య వదిలేశాడని ఆయన చెప్పారు. భార్యలను వదిలేసిన తర్వాత ఒంటరిగానే ఆయన జీవనం సాగిస్తున్నాడని ఆయన చెప్పారు.రిక్షాపుల్లర్‌గా సుబ్బయ్య జీవనం సాగిస్తున్నాడని ఆయన చెప్పారు. సుబ్బయ్యకు తెలిసిన బాలికను మాయామాటలతో అత్యాచారానికి పాల్పడ్డారని డీజీపీ చెప్పారు.
బాలికపై అత్యాచారానికి పాల్పడిన తర్వాత నిందితుడు సుబ్బయ్య కృష్ణానది వైపు వెళ్ళినట్టు డీజీపీ చెప్పారు. నిందితుడి కోసం మూడు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టినట్టు చెప్పారు. నిందితుడు మానసిక వైకల్యంతో ఈ దారుణానికి పాల్పడి ఉంటారని డీజీపీ చెప్పారు. ఈ ఘటనపై ప్రభుత్వం కూడ చాలా సీరియస్‌గా ఉందని చెప్పారు.












Click it and Unblock the Notifications