గర్జించిన తుపాకులు: ముగ్గురు మృతి (పిక్చర్స్)
తిరుమల: శేషాచలం అడవుల్లో తుపాకులు గర్జించాయి. బుధవారం రాత్రి 10.30 గంటలకు తిరుమలకు 12 కిలోమీటర్ల దూరంలో గుడ్డెద్దుల బండ వద్ద పోలీసులపై స్మగ్లర్లు దాడికి తెగబడటంతో పోలీసులు వారిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు స్మగ్లర్లు అక్కడిక్కడే చనిపోయారు. వారు ముగ్గురూ 30 ఏళ్లలోపు వయసువారు, తమిళనాడు ప్రాంతానికి చెందినవారు. సా
ర్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రెండు నెలలుగా దాడులు తగ్గిపోవడంతో తమిళనాడుకు చెందిన కూలీలను తీసుకుని ఎర్రచందనం స్మగర్లు పెద్దఎత్తున శేషాచలం అడవుల్లోకి ప్రవేశించారు. పెద్దసంఖ్యలో వారు అడవుల్లో తిష్ఠ వేశారనే సమాచారంతో పోలీసు, అటవీశాఖల సిబ్బంది పెద్ద ఎత్తున శేషాచలంలో గాలింపు చర్యలు చేపట్టారు. గత మూడు రోజులుగా సుమారు 300 మంది ఈ గాలింపులలో పాల్గొంటున్నారు.
ఈ క్రమంలో గుడ్డెద్దులబండ ప్రాంతంలో స్మగ్లర్ల దండు ఎర్రచందనం చెట్లు నరుకుతున్న అలికిడి వినిపించింది. దగ్గరకు వెళ్లి పరిశీలించగా వారు పెద్ద సంఖ్యలో ఉన్నారనే విషయం తెలిసింది. దీంతో వారు వెంటనే తిరుపతి అర్బన్ ఎస్పీకి సమాచారం అందించారు. ఆయన వేగంగా స్పందించి 25 మంది సాయుధ పోలీసులను తిరుమలకు పంపారు.
ఈ బృందం రాత్రి 12 గంటల ప్రాంతంలో గుడ్డెద్దుల బండ వద్దకు చేరుకున్నారు. పోలీసులందరూ కలిసి చెట్లు నరుకుతున్న కూలీలను పట్టుకోవడానికి ప్రయత్నించగా వారు బాణాలు, రాళ్లతో దాడులకు దిగారు. దీంతో పోలీసులు కాల్పులు జరపగా కూలీలు పారిపోయారు. పోలీసులు ఘటనా స్థలం వద్దకు వెళ్లి పరిశీలించగా కాల్పుల్లో ముగ్గురు కూలీలు చనిపోయినట్లు గుర్తించారు.

శేషాచలం అడవుల్లో కాల్పులు
శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లరపై పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ స్మగ్లరు శవం ఇలా పడిపోయింది.

శేషాచలం అడవుల్లో కాల్పులు
పోలీసులపైకి ఎర్రచందన చెట్లను నరుకుతున్నవారు కర్రలు, రాళ్లు విసిరారు. దాంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు.

శేషాచలం అడవుల్లో కాల్పులు
మొదటిసారి ఎర్రచందనం స్మగ్లర్లపై పోలీసుసు ఆధిపత్యం వహించారనే మాట వినిపిస్తోంది. పోలీసు కాల్పుల్లో ముగ్గురు మరణించారు.

శేషాచలం అడవుల్లో కాల్పులు
మీడియా ప్రతినిధులు తిరిగి వస్తుండగా వారిపై దాడి జరిగింది. వెంటనే వారు నేలపై పడుకున్నారు. పోలీసులు దాడిచేసినవారిని తిప్పికొట్టారు.












Click it and Unblock the Notifications