3 తీర్మానాలు: ముందుకెళ్తే సిఎం, బొత్స సహా రిజైన్‌లు!

ఈ భేటీలో మూడు తీర్మానాలు చేశారు. అధిష్టానం రాష్ట్ర నాయకత్వాన్ని పట్టించుకోకుండా ముందుకు వెళ్తే సిఎం, బొత్స సహా అందరు రాజీనామాలు చేయడం, ఆగస్టు 3న చేసిన సమైక్య తీర్మానానికి కట్టుబడి ఉండాలి, సభకు తెలంగాణపై తీర్మానం వస్తే అందరు కలిసి దానిని ఓడించాలి, అధిష్టానంతో సంప్రదింపుల ప్రక్రియ బాధ్యతను కిరణ్, బొత్సలకు అప్పగిస్తూ తీర్మానాలు చేశారు.
భేటీ అనంతరం మంత్రి శైలజానాథ్ మీడియాతో మాట్లాడారు. ఇది రాజకీయాలకు సమయం కాదన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యవాదాన్ని బలంగా వినిపిస్తున్నందున ఆయనను బలోపేతం చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. మొదటి నుండి సమైక్యాంధ్ర వాదన వినిపిస్తోంది సీమాంధ్ర కాంగ్రెసు నేతలు మాత్రమే అన్నారు.
విభజనకు అనుకూలంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మొదట మాట్లాడి... ఇప్పుడు అక్కడ ప్రజా ఉద్యమం రావడంతో వెనక్కి తగ్గారని ఆరోపించారు. ఇది రాజకీయాలు చేయడానికి సమయం కాదని అందరు తెలుసుకోవాలన్నారు. కాగా నేతల మధ్య మొదట భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనా ఆ తర్వాత అంతా సర్దుకుంది. అందరు కలిసి తీర్మానం చేశారు.












Click it and Unblock the Notifications