టీడీపీ ఎమ్మెల్సీలకు ముందస్తు రిటైర్మెంట్-కొనసాగించాలని పట్టు-కోర్టుకెళ్లే యోచనలో
ఏపీ శాసనమండలిలో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్సీల పదవీకాలం త్వరలో ముగియబోతోంది. అయితే రిటైర్మెంట్ కంటే ముందుగానే వీరిని ముందస్తు రిటైర్మెంట్ ఇవ్వాలని అసెంబ్లీ అధికారులు నిర్ణయించారు. దీంతో ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వారు న్యాయపోరాటానికి సిద్దమవుతున్నారు. టీడీపీకి చెందిన బాబూ రాజేంద్రప్రసాద్, జగదీష్, రెడ్డి సుబ్రహ్మణ్యం వీరిలో ఉన్నారు.
కరోనా నేపథ్యంలో ప్రస్తుతం రిటైర్మెంట్ పెండింగ్ లో ఎగువ సభల సభ్యులను తదుపరి సభ్యులు అయ్యే వరకూ పదవుల్లో కొనసాగించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది. అయితే ఈ ఆదేశాలు అమలు చేయకుండా రిటైర్మెంట్ కంటే ముందుగానే తమను సాగనంపేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై టీడీపీ ఎమ్మెల్సీలు బాబూ రాజేంద్రప్రసాద్, జగదీష్, రెడ్డి సుబ్రహ్మణ్యం మండిపడుతున్నారు. ఈ మేరకు తమను కొనసాగించాలంటూ అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులకు వారు లేఖ రాశారు..

కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం తమను ఆగస్టు 11 వరకూ ఎమ్మెల్సీలుగా కొనసాగించాలని బాబూ రాజేంద్రప్రసాద్, జగదీష్, రెడ్డి సుబ్రహ్మణ్యం అసెంబ్లీ కార్యదర్శికి రాసిన లేఖలో డిమాండ్ చేశారు. తమను ముందుగానే రిటైర్మెంట్ ప్రకటించడం అన్యాయమని వారు పేర్కొన్నారు. సీఈసీ ఆర్డర్ కు విరుద్ధంగా తమను ముందుగానే పదవీ విరమణ చేయించారని వారు ఆరోపిస్తున్నారు. దీనిపై కోర్టును ఆశ్రయించేందుకు కూడా సిద్ధమవుతున్నారు. గత నెల 18న ఏడుగురు టీడీపీ ఎమ్మెల్సీలు, ఒక వైసీపీ ఎమ్మెల్సీ రిటైరైనట్లు అసెంబ్లీ వర్గాలు ప్రకటించాయి.












Click it and Unblock the Notifications