కిలోల కొద్దీ బంగారం తెచ్చి, చిక్కిన స్త్రీలు (ఫొటోలు)
హైదరాబాద్: సింగపూర్ నుంచి వచ్చిన ముగ్గురు మహిళలు 5.154 కీలోల బంగారంతో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులకు చిక్కారు. ఆ బంగారం విలువ 1.5 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. హైదరాబాదులోని కొత్తపేటకు చెందిన ముగ్గురు మహిళలు మూడు రోజుల క్రితం టూరిస్టు వీసాపై సింగపూర్ వెళ్లారు.
వారు బుధవారం తెల్లవారు జామున టైగర్ ఎయిర్‌వేస్ విమానంలో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగారు. తనిఖీలు చేస్తున్న సమయంలో ఆ మహిళలు దుస్తుల కింద నడుముకు పెద్ద యెత్తున బంగారం చుట్టుకున్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు.
గత రెండు రోజుల్లో పెద్ద యెత్తున బంగారం స్మిగ్లింగ్ సంఘటనలు బయటపడడం ఇది రెండోసారి. మంగళవారంనాడు రెవెన్యూ ఇంటిలిజెన్స్ డైరెక్టరేట్ అధికారులు దుబాయ్ నుంచి వచ్చిన ఇద్దరు స్మగ్లర్లను పట్టుకున్నారు. వేర్వేరు విమానాల్లో వచ్చిన వారి నుంచి అధికారులు 2.17 కోట్ల రూపాయల విలువ చేసే 7.7 కిలోల బంగారాన్ని పట్టుకున్నారు.

లేడీ ప్యాసెంజర్ నుంచి పట్టుకున్న బంగారం
సింగపూర్ నుంచి హైదరాబాదుకు బంగారాన్ని పెద్ద యెత్తున తెచ్చిన ముగ్గురు మహిళలను కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

నడుమలకు చుట్టుకుని వచ్చారు
కిలోల కొద్దీ బంగారాన్ని దుస్తుల మాటను నడుములకు చుట్టుకుని మహిళలు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు.

తనిఖీల్లో ఇలా...
హైదరాబాద్ నగరంలోని ముషీరాబాద్‌లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. పెద్ద యెత్తున వారికి వెండి లభించింది.

కిలోల కొద్దీ వెండి నగలు
పోలీసులు హైదరాబాదులోని ముషీరాబాద్‌లో నిర్వహించిన తనిఖీల్లో 150 కిలోల వెండి నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications