లోటస్ పాండ్ వద్ద ఎమ్మెల్యేకు చేదు అనుభవం : వైసిపి లో టిక్కెట్ల రగడ ..!
టిక్కెట్ల రగడ వైసిపి లోనూ మొదలైంది. ఇంకా అధికారికంగా టిక్కెట్లను ఖరారు చేయకముందే ఆశావాహులు నిరసనల కు దిగుతున్నారు. వైసిపి ఎమ్మెల్యేకు లోటస్ పాండ్ లోకి ఎంట్రీ నిరాకరించటంతో కుటుంబ సభ్యులతో వచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్యే రెండు గంటల పాటు నిరీక్షించాల్సి వచ్చింది.
సొంత పార్టీ ఎమ్మెల్యేకే నో ఎంట్రీ..
వైసిపి కేంద్ర కార్యాలయం లోకి సొంత పార్టీ ఎమ్మెల్యే ఎంట్రీని అడ్డుకున్నారు.ఈ ఘటన పార్టీలో చర్చ నీయాంశంగా మారింది. పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్ తన కుటుంబ సభ్యులతో కలిసి లోటస్ పాండ్ కు వచ్చారు. ఆయనను లోపల కు అనుమతించకుండా అడ్డుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి దాదాపు రెండు లోపలకు ఎంట్రీ కోసం నిరీక్షించారు. అదే సమయంలో చిత్తూరు జిల్లాకే చెందిన సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లోపలకు వెళ్తూ సునీల్ ను చూసినా పట్టించుకోకుండా వెళ్లిపోవటం పై మనస్థాపానికి గురయ్యారు.

ఉరవకొండ..బాపట్ల సీట్ల కోసం ఆందోళనలు..
ఇక, సీట్ల కోసం పంచాయితీలు మొదలయ్యాయి. సీట్ల కోసం అధినేత నివాసం ముందు ఆందోళనలకు దిగారు. అనంత పురం జిల్లా ఉరవకొండ సీటు సిట్టింగ్ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డికి ఇవ్వద్దంటూ..మాజీ ఎమ్మెల్యే శివరామిరెడ్డి మద్దతు దారు లు ఆందోళన చేసారు. అదే సమయానికి అటుగా వచ్చిన వైయస్ వివేకానందరెడ్డి కారును అడ్డగించారు. ఆయన వారిని సముదాయించే ప్రయత్నం చేసారు. అదే విధంగా గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కోన రఘు పతి కి సీటు ఇవ్వద్దంటూ చీరాల గోవర్దనరెడ్డి మద్దతు దారులు ఆందోళన కు దిగారు. అయితే, చీరాల గోవర్దన రెడ్డి టిడిపి తో టచ్ లో ఉన్నట్లుగా వైసిపి నేతలు చెబుతున్నారు. వైసిపి నేతలు ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నం చేసినా ఆయన అందుబాటులోకి రాలేదని సమాచారం.












Click it and Unblock the Notifications