టీడీపీ - జనసేన పొత్తుతో సంచలనమే : చంద్రబాబు- పవన్ ఆలోచించాలి : మాజీ మంత్రుల అభిలాష..!!
ఏపీలో రాజకీయ సమీకరణాలు మార్పు దిశగా అడుగులు వేస్తున్నాయి. 2014 ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ పొత్తు పెట్టుకోగా జనసేన అధినేత వారికి మద్దతుగా నిలిచారు. పవన్ - మోదీ మద్దతుతో టీడీపీ అధికారంలోకి వచ్చిందంటూ 2014 ఎన్నికల ఫలితాల తరువాత పెద్ద ఎత్తున చర్చ సాగింది. కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ..ఏపీ ప్రభుత్వంలో బీజేపీ చేరి పరస్పరం సహకరించుకున్నారు. కాలం గడిచేకొద్దీ ప్రతిపక్ష నేత జగన్ తన వ్యూహాలను పదును పెట్టారు. అందులో భాగంగా ప్రత్యేక హోదా పైన వేసిన ట్రాప్ లో చిక్కుకున్న చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం నుంచి తన మంత్రులను ఉప సంహరించుకున్నారు.

పాత మిత్రులు మరలా కలుస్తారా
ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు. అదే సమయంలో ఏపీ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందంటూ టీడీపీకి జనసేన అధినేత పవన్ గుడ్ బై చెప్పారు. ఫలితంగా ఏపీలో చంద్రబాబు 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసారు.ఫలితంగా 2019 ఎన్నికల్లో జగన్ అధికారంలోకి వచ్చారు. ఏకంగా 151 సీట్లు 22 ఎంపీ సీట్లు గెలుచుకోగా..టీడీపీ 23 అసెంబ్లీ సీట్లు..జనసేన ఒక్క సీటుకు పరిమితం అయ్యాయి. ఆ తరువాత జనసేన కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తు కుదుర్చుకుంది. ఇక, ఈ రెండున్నారేళ్ల కాలంలో వరుసగా జరిగిన అన్ని ఎన్నికల్లోనూ వైసీపీ విజయం సాధించింది.

స్థానిక ఎన్నికల్లో టీడీపీ -జనసేన అవగాహనతో
తాజాగా, జరిగిన ఎంపీటీసీ-జెడ్పీటీసీ ఎన్నికల్లో అధికారికంగా కాకున్నా..లోపాయి కారీగా స్థానికంగా ఉన్న పరిస్థితుల్లో జనసేన-టీడీపీ నేతలు పరస్పరం సహకరించుకున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈ రకమైన అవగాహన ఓపెన్ గానే కనిపించింది. అయితే, ఇది అధినేతల అంగీకారంతో కాదని..స్థానికంగా తీసుకున్న నిర్ణయాలని చెబుతున్నారు. ఏకపక్షంగా వైసీపీ అన్ని ఎన్నికల్లో విజయం సాధించటం..ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్న ప్రాంతాల్లో ఆ రెండు పార్టీల అభ్యర్దులకు సానుకూల ఫలితాలు రావటంతో, తిరిగి ఇప్పుడు రెండు పార్టీల పొత్తు అంశం తెర మీదకు వచ్చింది.

పవన్ - చంద్రబాబు కలవాలంటూ..
పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట లో టీడీపీ - జనసేన కలిసి ఎంపీపీ గెలుచుకున్నారు. తూర్పు గోదావరి జిల్లాల్లో రాజోలు నియోజకవర్గ పరిధిలోని రాజోలు, మలికిపురం మండల పరిషత్ లు గెలుచుకున్నాయి. దీంతో..మాజీ మంత్రులు ఒక్కొక్కరుగా జనసేన - టీడీపీ తిరిగి పొత్తు ఖరారు చేసుకోవాలని..దీని ద్వారా సంచలనాలు జరగుతాయంటూ చెప్పుకొస్తున్నారు. మాజీ మంత్రి పితాని సత్యనారాయణ..ఈ రోజు మరో మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు ఇదే రకమైన వ్యాఖ్యలు చేసారు.

సంచలనాలే అంటున్న మాజీ మంత్రులు
ఈ దిశగా జనసేన అధినేత పవన్..టీడీపీ అధినేత చంద్రబాబు ఆలోచన చేయాలని సూచించారు. టీడీపీ, జనసేన పొత్తుతో సంచలన విజయం ఖాయమని టీడీపీ మాజీమంత్రి గొల్లపల్లి సూర్యారావు స్పష్టం చేశారు. రాజోలు నియోజకవర్గ పరిధిలోని రాజోలు, మలికిపురం మండల పరిషత్ విజయమే నిదర్శనమన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు సాగిస్తున్న వైసీపీకి చరమగీతం పాడాలంటే జనసేన టీడీపీలు చారిత్రక పొత్తు అవసరం తప్పనిసరన్నారు. రెండు పార్టీల అధినేతలు కూడా ఒకసారి ఆలోచన చేసే దిశగా అడుగులు పడాలని సూచించారు.

టీడీపీతో కలిసేందుకు పవన్ సిద్దంగా ఉన్నారా
దీంతో..తిరిగి టీడీపీ తో జత కట్టటానికి జనసేన సిద్దంగా ఉందా లేదా అనేదే ఇప్పుడు ఆసక్తి కర అంశంగా మారుతోంది. జగన్ ను ఎదుర్కోవాలంటే తిరిగి పాత పొత్తులు అవసరమనే అభిప్రాయం టీడీపీ నుంచి వినిపిస్తోంది. మరి..ఈ దిశగా చంద్రబాబు అండ్ పవన్ ఏమైనా స్పందిస్తారా .. ముందుకు వస్తారా లేదా అనేది వేచి చూడాలి. అయితే, బీజేపీతో సైతం తిరిగి దోస్తీ చేయాలని టీడీపీ భావిస్తోంది. కానీ, బీజేపీ నుంచి ఆ దిశగా కదలిక లేదని సమాచారం. దీంతో..మరి ఇప్పుడు పవన్ ఏం చేస్తారనేది కీలకంగా మారుతోంది.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!












Click it and Unblock the Notifications