మిరాకిల్ : ఎయిడ్స్ ను జయించిన మొట్ట మొదటి మనిషి
జర్మనీ : వైద్య శాస్త్రానికి కొరకరాని కొయ్యలా తయారై.. ఎలాంటి చికిత్సకు లొంగకుండా.. మానవాళిని కబళిస్తోన్న ఎయిడ్స్ కు ఇప్పుడో చికిత్స అందుబాటులోకి వచ్చింది. జర్మనీ వైద్యుల నిరంతర పరిశోధన వల్ల ఓ వ్యక్తి పూర్తి స్థాయిలో ఎయిడ్స్ నుంచి తిరిగి సాధారణ స్థితికి చేరకున్నాడు. అతని శరీరం నుంచి హెచ్ఐవి వైరస్ ను పూర్తిగా పారద్రోలడంలో సఫలీకృతులయ్యారు జర్మనీ వైద్యులు.
పూర్తి వివరాలను పరిశీలిస్తే.. 1966లో జన్మించిన అమెరికాకు చెందిన తిమోతీ రాయ్ బ్రౌన్ 1995లో ఎయిడ్స్ బారిన పడ్డాడు. అనంతరం చికిత్స నిమిత్తం బెర్లిన్ వైద్యులను సంప్రదించాడు. ఎయిడ్స్ పరిశోధనలకు తన శరీరాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా అక్కడి వైద్యులను కోరాడు. దీంతో 2007 నుంచి 'స్టెమ్ సెల్ ప్లాంటేషన్' అనే చికిత్సా పద్ధతి ద్వారా అతనికి వైద్యం చేస్తున్నారు అక్కడి వైద్యులు. దాంతో పాటు అతనిలోనీ సీడీ4 కౌంట్ ను పెంచడానికి పలు రకాల చికిత్సలు చేసినట్లు తెలుస్తోంది.
అదే సమయంలో.. రిట్రో వైరల్ థెరపీ ద్వారా చికిత్స అందిస్తూ వచ్చారు. ఇన్నాళ్ల వైద్యుల కృషి ఫలించి ఇప్పుడు ఆ వ్యక్తి పూర్తిగా ఎయిడ్స్ ను జయించాడు. ప్రస్తుతం అతను హెచ్ఐవీ నెగటివ్. రాయ్ శరీరంలో ప్రస్తుతం ఎలాంటి హెచ్ఐవి వైరస్ లేదని స్పష్టం చేశారు వైద్యులు. ఏదైమైనా వైద్య శాస్త్రంలో ఇప్పుడిదో అరుదైన ఆవిష్కరణ. .జర్మనీ వైద్యులు అవలంభించిన చికిత్సా పద్దతులు ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వస్తే.. ఎయిడ్స్ ను పూర్తిగా నిర్మూలించే రోజులు కూడా రావచ్చేమో!












Click it and Unblock the Notifications