జగన్ సొంతగడ్డపై టిప్పుసుల్తాన్ విగ్రహం- కుదరదన్న సోము వీర్రాజు-సీఎం ఏమంటారో ?
సీఎం జగన్ సొంత జిల్లా కడపలోని ప్రొద్దుటూరులో టిప్పుసుల్తాన్ విగ్రహ ఏర్పాటు వ్యవహారం నానాటికీ వివాదాస్పదమవుతోంది. పట్టణంలో కొందరు ముస్లింలతో కలిసి స్ధానిక వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి ఏర్పాటు చేస్తున్న ఈ విగ్రహంపై బీజేపీ మండిపడుతోంది. ఇప్పటికే కర్నాటకలో టిప్పుసుల్తాన్ జయంతి కార్యక్రమాల్ని వ్యతిరేకిస్తున్న కాషాయ నేతలు.. ఇప్పుడు జగన్ సొంత జిల్లాలో, అదీ వైసీపీ ఎమ్మెల్యే సాయంతో ఏర్పాటవుతున్న విగ్రహంపైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

జగన్ గడ్డపై టిప్పు సుల్తాన్ విగ్రహం
చరిత్రలో భారతదేశాన్ని పాలించిన రాజుల్లో టిప్పుసుల్తాన్ కూడా ఒకరు. టిప్పు సుల్తాన్‌కు చరిత్రలో భిన్న వాదనలు ఉంటాయి. అలాగే ఆయనకు సంబంధించి రాజకీయ పార్టీలు కూడా ఎవరికి వారే అభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటారు. ఇలాంటి పరిస్దితుల్లో తాజాగాఏపీలోనూ టిప్పుసుల్తాన్ ప్రస్తావన మొదలైంది. సీఎం జగన్ సొంత జిల్లా కడపలో టిప్పుసుల్తాన్ విగ్రహం ఏర్పాటు చేసేందుకు జరుగుతున్న స్ధానికంగా ఉండే ముస్లింలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. జిల్లాలోని ప్రొద్దుటూరులో వైసీపీ నేతల ప్రోత్సాహంతో ఈ విగ్రహం ఏర్పాటు కాబోతోంది.

టిప్పుసుల్తాన్ విగ్రహం తగదన్న సోము వీర్రాజు
కర్నాటకలో టిప్పుసుల్తాన్ జయంతిని నిర్వహించే విషయంలో ఇప్పటికీ బీజేపీ నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంటారు. మిగతా పార్టీలు మాత్రం టిప్పుసుల్తాన్‌కు మద్దతుగా నిలుస్తుంటాయి. ఇప్పుడు కడప జిల్లా ప్రొద్దుటూరులో ఏర్పాటు చేయబోతున్న టిప్పు సుల్తాన్ విగ్రహం విషయంలోనూ బీజేపీ నేతలు అభ్యంతరాలు మొదలుపెట్టారు. భారతీయుల్ని కాఫిరులుగా (దేవుడిపై విశ్వాసం లేనివారు)గా ముద్ర వేసి ఊచకోత కోసిన దుర్మార్గుడు టిప్పుసుల్తాన్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. అలాంటి వ్యక్తి విగ్రహం ఏపీలో పెట్టడం తగదన్నారు. మతసామరస్యానికి మారుపేరైన ప్రొద్దుటూరులో టిప్పు విగ్రహం ఏర్పాటుతో ఉద్రిక్త పరిస్ధితులు ఏర్పడతాయని ఆయన హెచ్చరించారు.

టిప్పు సుల్తాన్‌కు బదులుగా కలాం విగ్రహం
టిప్పు సుల్తాన్ క్రూరుడు కాబట్టే ఆయన విగ్రహాలు ఎక్కడా ఏర్పాటు చేయలేదని సోము వీర్రాజు తెలిపారు. అలాంటిది ప్రొద్దుటూరులో టిప్పు విగ్రహం ఏర్పాటు చేయడంపై బీజేపీ ఆందోళన వ్యక్తం చేస్తోందన్నారు. టిప్పుసుల్తాన్ కంటే భారతదేశానికి సేవ చేసిన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం విగ్రహం ఏర్పాటు చేయాలని సోము వీర్రాజు సూచించారు. విగ్రహ కమిటీతో పాటు పుర ప్రముఖులు ఈ మేరేకు ఆలోచన చేయాలని సోము కోరారు.
Recommended Video

జగన్ నిర్ణయంపై ఆసక్తి
కడప జిల్లా ప్రొద్దుటూరులో వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదరెడ్డి దగ్గరుండీ మరీ టిప్పుసుల్తాన్ విగ్రహ నిర్మాణానికి శంఖుస్ధాపన చేసిన నేపథ్యంలో అదే జిల్లాకు చెందిన సీఎం జగన్ తాజా వివాదంపై ఏం చెప్తారో అన్న ఆసక్తి నెలకొంది. ఇప్పటికే బీజేపీ హిందూ దేవాలయాల్లో దాడులపై వైసీపీని టార్గెట్ చేసింది. ఇప్పుడు టిప్పు సుల్తాన్ వివాదంతో సీఎం సొంత జిల్లాలో చిచ్చుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. దీంతో సీఎం జగన్ ఈ వివాదాన్ని ఎలా టాకిల్ చేస్తారన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది.
-
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ షెడ్యూల్ - ఫలితాల డేట్ ఫిక్స్..!!












Click it and Unblock the Notifications