Tirumala: సీఎం వైఎస్ జగన్ తిరుమల పర్యటన షెడ్యూల్, ఏర్పాట్లు పరిశీలించిన టీటీడీ ఈవో, కలెక్టర్ !

తిరుమల/ తిరుపతి: శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల్లో భాగంగా అక్టోబ‌రు 11,12వ తేదీల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప‌ర్య‌ట‌న ఏర్పాట్ల‌పై క‌లెక్ట‌ర్ శ్రీ హ‌రినారాయ‌ణ్‌తో కలిసి టీటీడీ ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి శుక్ర‌వారం తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో స‌మావేశం నిర్వ‌హించారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్టోబర్ 11వ తేదీ సాయంత్రం తిరుమ‌ల‌లో శ్రీ‌వారికి ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పిస్తార‌ని టీటీడీ ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి తెలిపారు.

 సీఎం చేతుల మీదుగా ప్రారంభం

సీఎం చేతుల మీదుగా ప్రారంభం


ఈ సంద‌ర్భంగా ఈవో కెఎస్. జవహర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్య‌మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్టోబ‌రు 11వ తేదీన మ‌ధ్యాహ్నం తిరుపతికి చేరుకుని తిరుప‌తిలోని బ‌ర్డ్ ఆసుప‌త్రిలో శ్రీ వేంక‌టేశ్వ‌ర పీడియాట్రిక్ కార్డియాక్ ఆసుప‌త్రిని ప్రారంభిస్తార‌ని అన్నారు. త‌రువాత వ‌రుస‌గా అలిపిరి కాలిన‌డ‌క మార్గం పైక‌ప్పు, అలిపిరి పాదాల మండ‌పం వ‌ద్ద‌గ‌ల గోమందిరం ప్రారంభోత్స‌వాలు చేస్తార‌ని టీటీడీ ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి వెల్ల‌డించారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన సందర్బంగా చిత్తూరు జిల్లా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం

శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం


అక్క‌డినుండి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేరుగా తిరుమ‌ల‌కు చేరుకుని సాయంత్రం శ్రీ‌వారికి ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పిస్తార‌ని టీటీడీ ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి తెలిపారు. అక్టోబ‌రు 12న ఉద‌యం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీ‌వారిని ద‌ర్శించుకుంటార‌ని, ఆ తరువాత ఎస్వీబీసీ క‌న్న‌డ‌, హిందీ ఛాన‌ళ్లను, నూత‌న బూందీ పోటును ప్రారంభిస్తార‌ని డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి వివ‌రించారు.

అధికారులకు భాద్యతలు అప్పగింత

అధికారులకు భాద్యతలు అప్పగింత


తిరుప‌తిలో ముఖ్య‌మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొనే ప్రారంభోత్స‌వాల ప్ర‌దేశంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీసు అధికారుల‌తో స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌ని టీటీడీ భ‌ద్ర‌తా విభాగం అధికారుల‌ను టీటీడీ ఈవో జవహర్ రెడ్డి ఆదేశించారు. అలిపిరి పాదాల మండపం, గోమందిరం వ‌ద్ద అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి, జెఈవో శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి, బ‌ర్డ్ ఆసుప‌త్రిలో జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మ‌య్య ఏర్పాట్ల‌ను ప‌ర్య‌వేక్షిస్తార‌ని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి చెప్పారు.

 సీఎం ప్రోగ్రామ్ క్లిప్పింగ్స్ పరిశీలించిన టీటీడీ ఈవో

సీఎం ప్రోగ్రామ్ క్లిప్పింగ్స్ పరిశీలించిన టీటీడీ ఈవో


ఆ త‌రువాత ముఖ్య‌మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొనే కార్య‌క్ర‌మాల‌కు సంబంధించి త‌యారుచేసిన వీడియో క్లిప్‌ల‌ను ఈవో జవహర్ రెడ్డి ప‌రిశీలించి ప‌లు మార్పులు చేశారు.శ్రీ‌వారి ఆల‌యం వ‌ద్ద ఈవో జవర్ రెడ్డి త‌నిఖీల అనంత‌రం ముఖ్య‌మంత్రి వైఎస్ జగన్ మోన్ రెడ్డి ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో ఆయా ప్రాంతాల‌ను శుక్రవారం ఈవో త‌నిఖీ చేశారు.

సీఎం పర్యటన విజయవంతం చెయ్యాలి

సీఎం పర్యటన విజయవంతం చెయ్యాలి

శ్రీ బేడి ఆంజ‌నేయ‌స్వామివారి ఆల‌యం, మాడ వీధులు, గొల్ల‌మండ‌పం, బూందీ పోటు త‌దిత‌ర ప్రాంతాల‌ను టీటీడీ ఈవో జవర్ రెడ్డి ప‌రిశీలించారు. ముఖ్య‌మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప‌ర్య‌ట‌న సాఫీగా జ‌రిగేలా అన్ని విభాగాల అధికారులు స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌ని టీటీడీ ఈవో జవర్ రెడ్డి సూచించారు.టీటీడీ ఈవో వెంట క‌లెక్ట‌ర్ హ‌రినారాయ‌ణ్‌, అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి, సివిఎస్వో గోపినాథ్ జెట్టి, అర్బ‌న్ ఎస్‌పి వెంక‌ట అప్ప‌ల‌నాయుడు, అద‌న‌పు ఎస్‌పి మునిరామ‌య్య‌, టీటీడీ చీఫ్ ఇంజినీర్ నాగేశ్వ‌ర‌రావు, ఎస్ఇ-2 జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి త‌దిత‌రులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పర్యటన సందర్బంగా తిరుపతి, తిరుమలలో పోలీసులు ఇప్పటి నుంచి గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+