కల్తీ నెయ్యి కేసులో మరో ట్విస్ట్- సుబ్బారెడ్డి పీఏకి రెండేళ్లుగా వేమిరెడ్డి జీతం..?

ఏపీలో తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. లడ్డూ కల్తీ కేసులో ఇప్పటికే సిట్ నిందితుడిగా తేల్చిన టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాజీ పీఏ అప్పన్న ఎవరి మనిషి అంటూ మెదలైన చర్చలో పలు కొత్త పేర్లు వచ్చి చేరుతున్నాయి. లడ్డూ కల్తీలో అప్పన్న పాత్ర ఉందన్న ఆరోపణల నేపథ్యంలో ఆయన వైసీపీ మనిషే అని టీడీపీ ప్రచారం చేస్తుండగా.. నెల్లూరు టీడీపీ ఎంపీ వేమిరెడ్డికి అతను ఉద్యోగి అని జగన్ పార్టీ ఇవాళ సంచలన ఆరోపణ చేసింది. ే

టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డికి చెందిన వీపీఆర్‌ మైనింగ్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ నుంచి రెండేళ్లుగా అప్పన్న అకౌంట్‌లో రూ.25 వేల చొప్పున జమ చేస్తూ, అప్పన్నతో సంబంధమే లేదని ఎంపీ చెప్పడం విడ్డూరంగా ఉందని వైసీపీ నేత పుత్తా ప్రతాప్ రెడ్డి ఇవాళ వ్యాఖ్యానించారు. ఏ సంబంధం లేకపోతే ఇంతకాలం డబ్బులిస్తారా అని ప్రశ్నించారు. 2023 మార్చి నుంచి 2025 మార్చి వరకు కూడా, ప్రతి నెలా ఒకటి లేదా రెండు తేదీల్లో ఠంచన్‌గా ఎంపీ వేమిరెడ్డి మైనింగ్‌ కంపెనీ నుంచి నెఫ్ట్‌ ద్వారా నగదు బదిలీ చేయడంపై టీడీపీ నాయకులు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు.

Tirumala Ghee Row YSRCP Alleges YV Subba Reddy s PA was Vemireddy s Employee Adding New Twist

వైయస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చెప్పడంతోనే సాయం చేశానని చెబుతున్న వేమిరెడ్డి, పార్టీ మారి టీడీపీ నుంచి దంపతులిద్దరూ ఎంపీ, ఎమ్మెల్యేలుగా గెలిచిన ఏడాదిన్నర వరకు కూడా ప్రతినెలా సాయం చేస్తారా అని ప్రశ్నించారు.అప్పన్న వైవీ సుబ్బారెడ్డి పీఏ కాదని, అతడు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి పీఏ అని జగన్‌ చెప్పిన విషయాన్ని మాత్రమే తీసుకుని ఆ ఎంపీతో మాట్లాడించారని పుత్తా ఆరోపించారు. సుబ్బారెడ్డి చెప్పడం వల్లే అప్పన్నకి ఆర్థిక సహాయం చేశానని వీపీఆర్‌ చెప్పారని, అదే నిజమైతే.. ఆ సహాయం ఒకేసారి కాకుండా, ప్రతి నెలా 1 లేదా 2వ తేదీన రూ.25 వేల చొప్పున బదిలీ చేస్తారా అని అడిగారు.

Tirumala Ghee Row YSRCP Alleges YV Subba Reddy s PA was Vemireddy s Employee Adding New Twist

వీపీఆర్‌ పార్టీ మారి, టీడీపీ నుంచి గెల్చిన తర్వాత కూడా దాదాపు ఏడాదిపాటు, ప్రతి నెలా నగదు బదిలీ చేశారని పుత్తా ఆరోపించారు. ఎవరైనా అలా చేస్తారా? ఏది మాట్లాడిన తమ అనుకూల మీడియా ప్రచారం చేస్తుంది కాబట్టి.. ప్రజలు కూడా నమ్ముతారని భావించి, ఇలా ఇష్టానుసారం అబద్ధాలు చెప్పడం ధర్మమా? అని అడిగారు. రాష్ట్రంలో ఎక్కడ, ఏం జరిగినా, ఎవరు నేరం చేసినా.. దాన్ని వైయస్సార్‌సీపీకి అంటగట్టి పబ్బం గడుపుకోవాలనుకోవడం సిగ్గుచేటు అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+