లడ్డూ కల్తీ కేసులో బిగ్ ట్విస్ట్..! అప్రూవర్ గా ధర్మారెడ్డి..! తెరపైకి వాళ్లు..!
ఏపీ రాజకీయాల్లో తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం మరోసారి కలకలం రేపుతోంది. తాజాగా ఇతర రాష్ట్రాలకు చెందిన భోలే బాబా డెయిరీ సరఫరా చేసిన నెయ్యిలో పాలు లేవని, కేవలం రసాయనాలు మాత్రమే ఉన్నట్లు సుప్రీంకోర్టు నియమించిన సిట్ తాజాగా నిర్ధారించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ వ్యవహారంలో ఎవరెవరి పాత్ర ఉందన్న దానిపై సిట్ ఫోకస్ చేస్తోంది. ఇదే క్రమంలో అప్పట్లో నెయ్యి పంపిణీని ఆమోదించిన మాజీ ఈవో ధర్మారెడ్డిని ప్రశ్నించి కీలక వివరాలు రాబడుతోంది.
ధర్మారెడ్డి జేఈవోగా ఉన్న సమయంలో తిరుమల లడ్డూ తయారీ కోసం వాడిన నెయ్యిని భోలేబాబా డెయిరీ నుంచి తీసుకునేందుకు వీలుగా బోర్డు ఆమోద ముద్ర వేయడంతో దీని వెనుక ఎవరున్నారనే దానిపై సిట్ ఆరా తీస్తోంది. ఇదే క్రమంలో ధర్మారెడ్డి అప్రూవర్ గా మారి సిట్ కు కీలక వివరాలు అందించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అప్పట్లో టీటీడీ ఛైర్మన్ గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి ఆదేశాలతోనే తాను ఇలా కల్తీ నెయ్యి అని తెలిసినా అనుమతించినట్లు ధర్మారెడ్డి అంగీకరించినట్లు సమాచారం.

అప్రూవర్‌గా మారిన టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి.. సిట్ విచారణకు సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా అప్పట్లో
భోలేబాబా, ఏఆర్ డెయిరీ డైరెక్టర్లతో సంప్రదింపులు జరిపినట్లు అంగీకరించినట్లు సమాచారం. కల్తీ నెయ్యి సరఫరా అవుతోందని CFTRI ఇచ్చిన రిపోర్టును చూశానని ధర్మారెడ్డి స్టేట్‌మెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే కల్తీ నెయ్యి సరఫరా అవుతుందని ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి తెలుసని ధర్మారెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది.
సీబీఐ నేతృత్వంలోని సిట్ అలిపిరి సమీపంలోని తాత్కాలిక కార్యాలయంలో ధర్మారెడ్డిని ప్రశ్నిస్తోంది. నిన్న సిట్ అధికారులు దాదాపు తొమ్మిది గంటల పాటు ఆయనను విచారించారు. సీబీఐ డీఐజీ మురళీ రంభ నేతృత్వంలోని అధికారులు ఆయన పదవీకాలంలో నెయ్యి సేకరణ, సరఫరాదారుల ధృవీకరణ, నాణ్యత నియంత్రణ చర్యలలో జరిగిన లోపాలపై ప్రశ్నించినట్లు తెలుస్తోంది. 2022లో టీటీడీ బ్లాక్‌లిస్ట్ చేసిన భోలే బాబా డెయిరీ, బినామీ సంస్థల ద్వారా నెయ్యిని సరఫరా చేయడంపై ఆయన్ను ప్రశ్నించారు.భోలే బాబా డెయిరీకి వివిధ రసాయనాలను సరఫరా చేసిన అజయ్ కుమార్ సుగంధ్ అనే వ్యక్తిని సిట్ తాజాగా అరెస్టు చేసింది.

ఉత్తరాఖండ్‌కు చెందిన భోలే బాబా ఆర్గానిక్ డెయిరీ ఎక్కడి నుండైనా ఒక్క చుక్క పాలు లేదా వెన్నను సేకరించలేదని, అయినప్పటికీ 2019 మరియు 2024 మధ్య నెల్లూరుకు చెందిన వైష్ణవి డెయిరీ, మహారాష్ట్రకు చెందిన మాల్ గంగా డెయిరీ , తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీ వంటి దాని బినామీల ద్వారా టీటీడీకి 68 లక్షల కిలోల నెయ్యిని సరఫరా చేయగలిగిందని సిట్ దర్యాప్తులో తేలింది.భోలే బాబా డెయిరీ ప్రమోటర్లు పూర్తి స్థాయి నకిలీ దేశీ నెయ్యి తయారీ యూనిట్‌ను స్థాపించి, లడ్డూ ప్రసాదం తయారీకి రూ.250 కోట్ల విలువైన 68 లక్షల కిలోల నకిలీ నెయ్యిని టీటీడీకి సరఫరా చేశారని ఆరోపణలు ఉన్నాయి.
-
రూ.300 టికెట్లు లేకపోయినా శ్రీవారి దర్శనం- భక్తుల కోసం టీటీడీ కొత్త విధానం...!! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!!












Click it and Unblock the Notifications