తిరుమల కల్తీ నెయ్యి కేసులో మరో ట్విస్ట్..! టీటీడీలో తొలి వికెట్..!
ఏపీలో గత వైసీపీ హయాంలో తిరుమల తిరుపతి దేవస్దానంలో లడ్డూ కల్తీ జరిగిందన్న ఆరోపణలపై సుప్రీంకోర్టు ఆదేశాల్ మేరకు జరుగుతున్న సీబీఐ సిట్ దర్యాప్తులో ఇవాళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఇప్పటివరకూ లడ్డూ తయారీ కోసం నెయ్యి, ఇతర పదార్ధాలు సరఫరా చేసిన కాంట్రాక్టర్లపై మాత్రమే ఫోకస్ పెట్టి అరెస్టులు చేస్తున్న సీబీఐ.. ఇవాళ మాత్రం తొలిసారి ఓ టీటీడీ అధికారిని అరెస్టు చేసింది. దీంతో ఈ వ్యవహారం దేవస్థానంలో కలకలం రేపుతోంది.
తిరుమల కల్తీ నెయ్యి కేసులో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు జరుపుతున్న సీబీఐ.. ఇవాళ తొలిసారిగా ఓ టీటీడీ అధికారిని అరెస్టు చేసింది. టీటీడీ కొనుగోలు విభాగంలో జీఎంగా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యాన్ని సీబీఐ అరెస్టు చేసింది. దీంతో తిరుమల కల్తీ నెయ్యి కేసులో అరెస్టుల సంఖ్య పదికి చేరింది. ఇప్పటికే టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని, మాజీ అదనపు ఈవో ధర్మారెడ్డిని సిట్ విచారించింది. అలాగే వైవీ సుబ్బారెడ్డి మాజీ వ్యక్తిగత సహాయకుడు చిన్నఅప్పన్నను అరెస్టు చేసింది.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ తయారీకి ఇతర రాష్ట్రాల డెయిరీలకు నెయ్యి సరఫరాకు టీటీడీ కాంట్రాక్టులు ఇచ్చింది. అయితే సదరు డెయిరీలు పాలకు బదులుగా రసాయనాలతో తయారు చేసిన నెయ్యిని సరఫరా చేసినట్లు ఇప్పటికే సిట్ గుర్తించింది. ఇలా సరఫరా చేసిన నెయ్యితో తయారు చేసిన 20 కోట్ల లడ్డూల్ని భక్తులకు పంపిణీ చేసినట్లు కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో తాజాగా మాజీ టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిిని హైదరాబాద్ లోని ఇంటికి వెళ్లి మరీ సిట్ విచారించింది.

ఈ నేపథ్యంలో టీటీడీ ఉద్యోగి సుబ్రమణ్యాన్ని అరెెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఇవాళ అరెస్టు చేసిన టీటీడీ జీఎం సుబ్రమణ్యాన్ని నెల్లూరు కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్ కు పంపేందుకు సీబీఐ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటివరకూ కల్తీ నెయ్యి కేసులో టీటీడీ బయటి వ్యక్తుల్ని మాత్రమే టార్గెట్ చేస్తున్న సీబీఐ. ఇప్పుడు ఉన్నట్లుండి లోపలి అధికారుల్ని కూడా అరెస్టులు చేయడం సంచలనం రేపుతోంది. దీంతో తాజాగా విచారించిన వైవీ సుబ్బారెడ్డి, మాజీ అదనపు ఈవో ధర్మారెడ్డి వంటి వారిని కూడా అరెస్టు చేస్తారా అన్న చర్చ జరుగుతోంది.












Click it and Unblock the Notifications