తిరుమల లడ్డు కల్తీ.. సంచలన ఆరోపణ చేసిన చంద్రబాబు దొరికిపోయారిలా!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుమల లడ్డు పైన కొనసాగుతున్న రగడ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తిరుమల లడ్డు వివాదం పైన పూర్తి స్థాయి విచారణ జరిపించాలని, దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తోంది. ఇక ఇదే విషయాన్ని మాజీ మంత్రి అంబటి రాంబాబు తాజాగా మాట్లాడుతూ పేర్కొన్నారు. తిరుమల లడ్డు కల్తీ ఆరోపణ చేసిన చంద్రబాబు దొరికిపోయారిలా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

పూర్తి స్థాయి విచారణ అంటున్నా చంద్రబాబు సైలెంట్ వెనుక కారణం ఇదే
ఏపీ ప్రభుత్వ వైఖరి పైన ఈ నేపథ్యంలో తీవ్రస్థాయిలో మండిపడిన మాజీ మంత్రి అంబటి రాంబాబు హిందూత్వాన్ని రెచ్చగొట్టడానికి చంద్రబాబు ఆరోపణ చేశారని స్పష్టమైపోయిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. డిఐజి స్థాయి అధికారితో విచారణ జరిపిస్తామని చంద్రబాబు చెబుతున్నారని, దేశమంతా సీబీఐ విచారణ అంటున్నా చంద్రబాబు ఆ నిర్ణయం తీసుకోకుండా డిఐజి స్థాయి అధికారితో విచారణ జరుపుతామని చెప్పటం వెనుక ఆంతర్యం అందరికీ అర్ధమైంది అన్నారు.

Tirumala Laddu row ambati rambabu said Chandrababu accused Tirumala Laddu adulteration has been now caught

పెద్ద ఆరోపణ చేసి ఇలాంటి విచారణా?
టీటీడీ ప్రసాదం తయారీ పైన పెద్ద ఆరోపణ చేసి డిఐజి స్థాయి అధికారితో విచారణ చేయిస్తారా అంటూ ప్రశ్నించారు. ఇది రాజకీయ ఆరోపణ కాకూడదని చాలామంది పూర్తి స్థాయి విచారణ చేయించాలని చాలా మంది అడుగుతున్నా, చంద్రబాబు ఆ నిర్ణయం తీసుకోలేదన్నారు. ప్రజలు చంద్రబాబు నిర్ణయంపై ఆశ్చర్యానికి గురయ్యారన్నారు. డీఐజీ స్థాయి అధికారితో విచారణకు బదులు లోకేష్ తో ఒక కమిటీ వేసి విచారణ జరిపించమని సెటైర్ వేశారు.

తిరుమల శ్రీవారి లడ్డులో కల్తీ నెయ్యి వాడారా? సమాధానం చెప్పు చంద్రబాబు
తిరుమల శ్రీవారి లడ్డులో కల్తీ నెయ్యి వాడారా అన్న ప్రశ్నకు చంద్రబాబు సమాధానం చెప్పడం లేదని అంబటి రాంబాబు విమర్శించారు. ఎక్కడైనా తప్పు చేసిన వాళ్ళే ప్రాయశ్చిత్త దీక్ష చేపడతారని అంబటి రాంబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. టిటిడి లడ్డు పై పూర్తిస్థాయి విచారణ జరగాల్సిందేనని ఆయన పేర్కొన్నారు.

మత ఘర్షణలు రెచ్చగొట్టే కుట్ర
తిరుమల శ్రీవారి ఆలయంలో తప్పు జరిగిపోయిందని చంద్రబాబు అనుకూల మీడియా ముందే రాసేసిందని అంబటి రాంబాబు విమర్శించారు. మత ఘర్షణలు రెచ్చగొట్టడానికి చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నార,ని ఆరోపణలు నిరూపించే శక్తి లేకనే ఇంత హంగామా సృష్టిస్తున్నారని అంబటి రాంబాబు పేర్కొన్నారు. హిందూ సాంప్రదాయాల గురించి చంద్రబాబు మాట్లాడడం ఆశ్చర్యంగా ఉందని తండ్రి చనిపోయినప్పుడు కూడా చంద్రబాబు తలనీలాలు ఇవ్వలేదన్నారు.

హిందూ సాంప్రదాయాల గురించి చంద్రబాబు మాట్లాడడం ఆశ్చర్యం
అటువంటి చంద్రబాబు సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారని అంబటి రాంబాబు అసహనం వ్యక్తం చేశారు. హిందూ సాంప్రదాయాల గురించి చంద్రబాబు మాట్లాడడం ఆశ్చర్యం కలిగిస్తుందని ఆయన పేర్కొన్నారు. టీటీడీ లడ్డు పైన పూర్తిస్థాయి విచారణ జరగాల్సిందేనని తాము కూడా డిమాండ్ చేస్తున్నామని మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+