వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బేడి ఆంజనేయస్వామికి బంగారు తాపడం.. టీటీడీ పాలకమండలి నిర్ణయాలు

|
Google Oneindia TeluguNews

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను ఎప్పటిలా వైభవంగా నిర్వహించాలని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం నిర్ణ‌యించింది. రెండున్నర సంవ‌త్స‌రాల తర్వాత సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వ‌హించ‌నున్నారు. టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి అధ్య‌క్ష‌త‌న ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌మావేశం జ‌రిగింది. అనంత‌రం వివ‌రాల‌ను వైవీ సుబ్బారెడ్డి మీడియాకు వెల్ల‌డించారు. వివ‌రాల‌న్నీ ఆయ‌న మాట‌ల్లోనే..

 ఆగమ పండితుల సలహా మేరకు బంగారు తాపడం పనులు

ఆగమ పండితుల సలహా మేరకు బంగారు తాపడం పనులు

ఆనందనిలయం బంగారు తాపడం పనులకు ఆగమ పండుతుల సలహాలు మేరకు మరో నెలలో ప్రారంభించ‌బోతున్నారు. బాలాలయం చేయడం వీలుకాదు కాబట్టి, టెక్నాలజీని వినియోగించి తాపడం పనులు నిర్వహించడంపై పరిశీలన చేస్తున్నారు. అలాగే తిరుమ‌ల‌లో ఆక్టోపస్ భవన నిర్మాణానికి రూ. 7 కోట్లు నిధులు మంజూరు చేయ‌నున్నారు. ప్రస్తుతం అమలవుతున్న విధంగానే సర్వదర్శన విధానం ఇక‌ముందు కూడా కొనసాగ‌బోతోంది.

 బేడి ఆంజనేయస్వామికి బంగారు తాపడం

బేడి ఆంజనేయస్వామికి బంగారు తాపడం


అమరావతి శ్రీవారి ఆలయంలో పచ్చదనాన్ని పెంపొందించడానికి రూ 2.09 కోట్లు, బేడి ఆంజనేయస్వామి మూలమూర్తికి ఉన్న రాగి కవచానికి బంగారు తాపడానికి రూ.18.75 లక్షలు మంజూరు చేశారు. తిరుమలలోని ఎస్వీ పాఠశాలను సింఘానియా ఎడ్యుకేషన్ ముంబై ద్వారా మోడర్న్ స్కూల్ కు రూపొందించాలనే నిర్ణ‌యంతోపాటు 8 రకాల టీటీడీ క్యాలండర్ లు, డైరీలు ముద్రణకు టెండర్ల‌ను ఆహ్వానించ‌బోతున్నారు. అలాగే రామ‌నాథ‌ గుహ అనే ఎన్ఆర్ఐ భక్తుడు బెంగళూరులోని రూ. 3.20 కోట్లు విలువ చేసే అపార్ట్మెంట్ ను స్వామివారికి విరాళంగా అంద‌జేశారు.

నెల్లూరులో 24 నుంచి వైభవోత్సవాలు

నెల్లూరులో 24 నుంచి వైభవోత్సవాలు


ఎస్.ఎస్.డి టోకన్లు జారీ పునరుద్ధరణ పై సాధ్యాసాధ్యాలు పరిశీలించి నిర్ణ‌యం తీసుకోవాల‌ని భావిస్తున్నారు. జులై 24 నుంచి నెల్లూరు నగరంలో శ్రీవారి వైభవోత్సవాలు నిర్వ‌హించ‌బోతున్నారు. తిరుమ‌ల‌లోని పార్వేట మండ‌పం స్థానంలో కొత్త‌గా రూ . 2.07 కోట్ల వ్య‌యంతో నూత‌న పార్వేట మండ‌పాన్ని నిర్ణ‌యించ‌బోతున్నారు. ఎస్వీ గోశాలలో పశుగ్రాసం కొనుగోలుకు రూ.7.30 కోట్ల నిధులు విడుద‌ల చేశారు.

 శ్రీవారి పోటు ఆధునికీకరణ

శ్రీవారి పోటు ఆధునికీకరణ


తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో ఐటి డెవలప్‌మెంట్‌కు రూ. 4.42 కోట్లు కేటాయించారు. శ్రీ‌వారి పోటు ఆధునికీక‌ర‌ణ లో భాగంగా బూందీ త‌యారీపై ఆస్ట్రేలియా, స్విట్జ‌ర్లాండ్‌కు చెందిన సాంకేతిక‌పై చ‌ర్చించారు. ఏపీ మార్క్ ఫెడ్ ద్వారా 12 రకాల గో ఆథారిత వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేయాల‌ని టీటీడీ నిర్ణ‌యించినట్లు సుబ్బారెడ్డి తెలిపారు.

English summary
tirumala tirupathi devasthanam board meeting and key decissions
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X