శ్రీవారికి కాసుల వర్షం - రికార్డు స్థాయిలో ఆదాయం..!!
తిరుమల శ్రీవారికి కాసుల వర్షం కురుస్తోంది. కరోనా తరువాత భారీ సంఖ్యలో తరలివస్తున్న శ్రీవారి భక్తులు తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. దీంతో..తొలి సారిగా రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం సమకూరింది. కరోనా కారణంగా దాదాపు రెండేళ్ల పాటు తిరుమలలో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తలు విషయంలో ఆంక్షలు అమలయినాయి. కరోనా తరువాత క్రమేణా భక్తుల సంఖ్య పెరిగింది. ఇప్పుడు భారీ స్థాయిలో భక్తులు కలిగియుగ దైవం వేంకటేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు. దీంతో..పాటుగా మొక్కులు మొక్కుకున్న వారు..ఆపద మొక్కుల వాడికి తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు.
తిరుమల లో ఎక్కువగా నిలువు దోపిడీ చెల్లించుకుంటామని మొక్కుకునే వారి సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో..ఈ సారి తిరుమల హుండీ ఆదాయం గణనీయంగా పెరిగింది. ఈ నెలలో 21వ తేదీ వరకు తిరుమల లో హుండీ ఆదాయం వంద కోట్లకు పైగా వచ్చినట్లు టీటీడీ వర్గాలు చెబుతున్నాయి. 21 రోజుల్లో శ్రీవారికీ హుండీ ద్వారా 100కోట్ల 75 లక్షల రూపాయల ఆదాయం సమకూరింది. ఇప్పటి వరకు గత మే మాసంలో లభించిన 130 కోట్ల రూపాయలే అత్యధిక హుండి ఆదాయంగా చెప్పుకొచ్చారు. మొట్ట మొదటి సారి హుండీ ద్వారా 140 కోట్ల రూపాయలు ఆదాయం శ్రీవారికీ లభించే అవకాశం ఉందని అంచనా.

తిరుమలకు వచ్చే భక్తులతో పాటుగా వాహనాల సంఖ్య కూడా పెరిగింది. శ్రీవారి ఆలయం, క్యూకాంప్లెక్స్‌లు, మాడవీధుల్లో భక్తుల రద్దీతో కనిపిస్తున్నాయి. అన్నదానం చేసే ప్రాంతం.. కళ్యాణ కట్ట ప్రాంతాలు సైతం భక్తులతో కిటకిటలాడుతున్నాయి. దీంతో..ఒక్క సారిగా భక్తుల సంఖ్య పెరిగింది. వారంతంలో చివరి మూడు రోజులు గతంలో ఉండే వీఐపీ దర్శనం రద్దు చేసారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు టీటీడీ అధికారులు చెబుతున్నారు. ఈ నెలాఖరు తరువాత ఈ నెల హుందీ ఆదాయం పైన టీటీడీ అధికారులు అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications