Tirupati: ఏడు కొండలకు గుర్తుగా ఏడు బ్రాండ్లు, ఇప్పుడు శ్రీవారి లడ్డూ లాగా అగరబత్తులు, డేట్ ఫిక్స్ !
తిరుమల/ తిరుపతి/ బెంగళూరు: తిరుమలోని శ్రీవారిని జీవితంలో ఒక్కసారైన దర్శించుకోవాలని ప్రతిఒక్క హిందువూ కొరుకుంటారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. శ్రీవారి భక్తులకు మెరుగైన సేవలు అందించడానికి టీటీడీ యంత్రాంగం, అక్కడి సిబ్బంది ప్రతిరోజూ 24 గంటలు శ్రమిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా టీటీటీ సిబ్బంది వారి శక్తికి మంచి శ్రమిస్తున్నారు. శ్రీవారి భక్తులకు ఇప్పుడు టీటీడీ మరో శుభవార్త చెప్పింది. టీటీడీ ఆలయాల్లో స్వామివారికి ప్రతినిత్యం ఎంతో పవిత్రంగా అలంకరించి పూజలు చేసే పుష్పాలతో అగరబత్తులు తయారుచేసి స్వామి వారి భక్తులకు అందించడానికి అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే తుది దశకు చేరుకున్న అగరబత్తుల తయారి ఓ కొలక్కి వచ్చింది. ఇదే నెల 13వ తేదీన స్వామివారికి అలంకరించిన పుష్పాలతో తయారు చేసిన అగరబత్తులు భక్తులకు అందించడానికి టీటీడీ అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఏడుకొండల స్వామికి గుర్తుగా, ఏడు కొండలకు గుర్తుగా ఏడు బ్రాండ్లతో శ్రీవారి భక్తులకు పుష్పాలతో తయారు చేసిన అగరబత్తులు అందుబాటులోకి వస్తున్నాయి. శ్రీవారి లడ్డూ లాగా ఇప్పుడు అగరబత్తులు భక్తులను ఆకట్టుకుంటాయని టీటీడీ బావిస్తోంది.

శ్రీవారికి అలంకరిస్తున్న పువ్వులు
టీటీడీ ఆలయాల్లో పూజలు, అలంకరణలకు పత్రి రోజూ పుష్పాలు వినియోగిస్తున్నారు. ప్రత్యేక పర్వదినాలు, ఉత్సవాల సమయంలో పుష్పాల వినియోగం మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ రకంగా ఉపయోగించిన పుష్పాలన్నీ మరుసటిరోజు ఉదయం తొలగిస్తారు. స్వామి సేవకు ఉపయోగించిన పుష్పాలు వృథా కాకుండా తిరిగి ఉపయోగించే విషయంపై టీటీడీ యాజమాన్యం సరికొత్త ఆలోచన చేసింది.

బెంగళూరు సంస్థతో టీటీడీ ఒప్పందం
ఈ క్రమంలో బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న దర్శన్ ఇంటర్నేషనల్ సంస్థ టీటీడీ ఆలయాల్లో రోజువారీగా వినియోగించిన పుష్పాలను అందిస్తే లాభం లేకుండా అగరబత్తులు తయారుచేసి అందిస్తామని ముందుకొచ్చింది. ఈ మేరకు ఆ సంస్థతో టీటీడీ అవగాహన కుదుర్చుకుని ఎస్వీ గోశాలలో అగరబత్తుల తయారీకి అవసరమైన స్థలం కేటాయించింది.

సుగంధాలు వెదజల్లే అగరబత్తులు
బెంగళూరుకు చెందిన దర్శన్ ఇంటర్నేషనల్ సంస్థ సొంత ఖర్చుతో యంత్రాలు, సిబ్బందిని నియమించుకుని కొన్ని రోజులుగా ప్రయోగాత్మకంగా అగరబత్తుల ఉత్పత్తిని ప్రారంభించింది. త్వరలో శ్రీవారి భక్తులకు నాణ్యమైన, సుంగధాలు వెదజల్లే అగబరత్తులు అందుబాటులోకి తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఎస్వీ గోశాలలో అగరబత్తుల తయారి
అగరబత్తుల తయారీ ఇలా: టీటీడీ స్థానిక ఆలయాల్లో వినియోగించిన పుష్పాలను ఉద్యానవన విభాగం సిబ్బంది ఎస్వీ గోశాలలోని అగరబత్తుల తయారీ కేంద్రానికి తరలిస్తారు. ప్రత్యేకంగా శిక్షణ పొందిన సిబ్బంది వీటిని రకాల వారీగా పుష్పాలను వేరు చేస్తారు. అనంతరం వాటిని డ్రైయింగ్ యంత్రంలో పూర్తిగా ఎండేలా చేసి పిండిగా మారుస్తారు.

రోజుకు 3. 50 లక్షల అగరబత్తుల తయారి
ఆ తరువాత పిండికి నీరు కలిపి కొన్ని పదార్థాలతో మిక్సింగ్ చేస్తారు. ఈ మిశ్రమాన్ని మరో యంత్రంలో వేసి అగరబత్తులు తయారుచేస్తారు. వీటిని ప్రత్యేక యంత్రంలో 15 నుంచి 16 గంటల పాటు ఆరబెట్టిన తరువాత మరో యంత్రంలో ఉంచి సువాసన వెదజల్లే ద్రావకంలో ముంచుతారు. చివరగా వీటిని మరోసారి ఆరబెట్టి యంత్రాల ద్వారా ప్యాకింగ్ చేస్తారు. మొత్తం 10 యంత్రాల ద్వారా రోజుకు 3.50 లక్షల అగరబత్తులు తయారుచేసేలా ఏర్పాట్లు చేశారు.
Recommended Video

ఏడు కొండలకు గుర్తుగా ఏడు బ్రాండ్లు
1. దివ్యపాద
2. తుష్టి
3. దృష్టి
4. సృష్టి
5. ఆకృష్టి
6. అభయహస్త
7. దివ్యపాద
7. అందుకేనా
శ్రీవారి లడ్డూలు లాగా అగరబత్తులు
ఈ ఏడు బ్రాండ్లతో శ్రీవారి భక్తులకు ఈనెల 13వ తేదీ నుంచి అగరబత్తులు అందుబాటులోకి వస్తాయని మంగళవారం టీటీడీ అధికారులు తెలిపారు. ఏడు కొండలస్వామికి గుర్తుగా ఏడు బ్రాండ్లతో శ్రీవారి భక్తులకు అందుబాటులోకి వస్తున్న అగరబత్తులు భక్తులకు చేరువ అవుతాయని టీటీడీ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. శ్రీవారి లడ్డూల తరహాలోనే స్వామి వారి పూలతో తయారు చేస్తున్న ప్రత్యేకమైన అగరబత్తులు భక్తులను ఆకట్టుకుంటాయని టీటీడీ అధికారులు అనుకుంటున్నారు.












Click it and Unblock the Notifications