తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం పొందే అదృష్టవంతులు ఎవరో- 24 లక్షల రిజిస్ట్రేషన్లు

పరమ పవిత్రంగా భావించే వైకుంఠ ఏకాదశి నాడు తిరుమలలో శ్రీవేంకటేశ్వర స్వామివరిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకోవడానికి టీటీడీ ప్రవేశపెట్టిన లక్కీ డిప్ రిజిస్ట్రేషన్లు సోమవారం సాయంత్రం 5 గంటలకు ముగిశాయి. ఈ నెల 27వ తేదీన ఉదయం 10 గంటలకు వీటి రిజిస్ట్రేషన్లు ఆరంభం కాగా.. ఇవి ముగిసేసమయానికి రికార్డు స్థాయిలో భక్తులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. గడువు ముగిసేసమయానికి నమోదైన మొత్తం రిజిస్ట్రేషన్లు 24,05, 237.

వైకుంఠ ద్వార దర్శనాల తొలి మూడు రోజులు.. డిసెంబర్ 30, 31, జనవరి 1 కోసమే ఇంతమంది భక్తులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వీరిలో 1.75 నుంచి 1.80 వేల మందికి మాత్రమే అవకాశం లభిస్తుంది. ఒక టికెట్ పై నలుగురు అంటే 1+3 (సెల్ఫ్ + ముగ్గురు కుటుంబ సభ్యులు) ప్రాతిపదికన శ్రీవారిని దర్శించుకోవచ్చు. వీరిని ఎంపిక చేయడానికి టీటీడీ ఈ మధ్యాహ్నం 2 గంటలకు లక్కీడిప్ ను నిర్వహించనుంది.

Tirumala Vaikuntha Dwara Darshan Registrations Hit Over 24 Lakh

డిప్‌లో ఎంపికైన వారి రిజిస్టర్డ్ సెల్‌ ఫోన్‌ నంబర్, ఇ-మెయిల్‌ కు లింక్ ను పంపిస్తారు. దీన్ని క్లిక్ చేస్తే టికెట్ డౌన్ లోడ్ అవుతుంది. వైకుంఠ ద్వార దర్శనాల తొలి మూడు రోజుల్లో శ్రీవారిని దర్శించుకునే ఆ 1,80,000 మంది అదృష్టవంతులు ఎవరనేది ఈ మధ్యాహ్నానికి తేలి పోతుంది. టీటీడీ వెబ్‌ సైట్‌- 9,28,608, యాప్‌- 13,29,112, వాట్సాప్‌ గవర్నెన్స్‌- 1,45,517 లక్షల మంది భక్తులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు.

లక్కీ డిప్ ఎలా తీస్తారనేది టీటీడీ వెల్లడించలేదు. ముందుగా తమ పేర్లను నమోదు చేసుకున్న వారికి అవకాశం ఇస్తారా లేక ర్యాండమ్ గా ఎంపిక చేస్తారా అనేది తెలియరావట్లేదు. దాదాపుగా లక్షా 80 వేల మందిని ఎంపిక చేయడం, వారికి టికెట్లను పంపించడం అనేది టీటీడీకి సవాల్ గా మారింది. తొలి మూడు రోజులకే 24 లక్షల మంది భక్తులు తమ పేర్లను నమోదు చేసుకున్నారంటే మిగిలిన రోజుల్లో వారి తాకిడి ఏ స్థాయిలో ఉంటుందనేది అర్థం చేసుకోవచ్చు.

జనవరి 2 వ తేది నుండి 8వ తేది వరకు రోజుకు రూ.300 దర్శన టిక్కెట్లు- 15,000, శ్రీవాణి దర్శన టికెట్లు- 1,000 రెగ్యూలర్ పద్ధతిలో టీటీడీ మంజూరు చేయనుంది. వీటికి అదే స్థాయిలో రద్దీ నెలకొనే అవకాశాలు లేకపోలేదు. డిసెంబర్ 5వ తేదీన శ్రీవాణి టికెట్లను జారీ చేయనుంది టీటీడీ. జనవరి 6, 7, 8 తేదీల్లో తిరుమల, తిరుపతి స్థానికులకు రోజుకు 5,000 టోకెన్లు మంజూరు అవుతాయి. ఆ 10 రోజుల పాటు ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా మిగిలిన అన్ని రకాల ప్రివిలేజ్ దర్శనాలు ఇప్పటికే రద్దయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+