TTD: తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్‌ షాక్.. !

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్యమైన అలర్ట్ ప్రకటించింది. రేపు ( సెప్టెంబర్ 7, 2025 ) చంద్రగ్రహణం కారణంగా 12 గంటల పాటు ఆలయ ద్వారాలు మూసివేయనున్నట్టు వెల్లడించింది. ఈ కారణంగా మొత్తం 15 గంటల పాటు భక్తుల దర్శనాలు నిలిపివేయనున్నారు.

దర్శనాల నిలిపివేత సమయాలు..

ఆగమ శాస్త్రాల ప్రకారం.. చంద్రగ్రహణానికి 6 గంటల ముందే ఆలయ ద్వారాలను మూసివేయాలి. అందువల్ల రేపు మధ్యాహ్నం 3:30 గంటలకు ఆలయం మూసి, ఎల్లుండి ఉదయం 3 గంటలకు మాత్రమే తిరిగి తెరవనున్నారు. గ్రహణ సమయం రాత్రి 9:50 నుంచి వేకువజామున 1:31 వరకు ఉంది. అందువల్ల ఆలయం మూసివేత సమయం రేపు మధ్యాహ్నం 3:30 నుంచి ఎల్లుండి ఉదయం 3:00 వరకుగా నిర్ణయించారు.

tirumala-venkateswara-temple-closed-for-15-hours-due-to-lunar-eclipse

పలు సేవల రద్దు..

ఇక ఈ కారణంగా రేపు ( సెప్టెంబర్ 7, 2025 ) ఆర్జిత సేవలు పూర్తిగా రద్దయ్యాయి. పౌర్ణమి గరుడ సేవ కూడా జరగదని స్పష్టం చేశారు. ఎల్లుండి ( సెప్టెంబర్ 8, 2025 ) ఉదయం జరగాల్సిన వీఐపీ బ్రేక్ దర్శనాలు కూడా రద్దు అయ్యాయి. అంతే కాకుండా రేపు మధ్యాహ్నం 3:30 నుంచి ఎల్లుండి ఉదయం 8:30 వరకు అన్నప్రసాదం కూడా మూసివేయబడుతుంది. ఈరోజు రాత్రి నుంచే సర్వదర్శనం భక్తులను క్యూ లైన్లలోకి అనుమతించరని తెలుస్తోంది.

ఈ మేరకు భక్తులకు ఇబ్బంది కలగకుండా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ముందుగానే 30,000 ఆహార పొట్లాలను సిద్ధం చేసింది. రేపు సాయంత్రం 4:30 గంటలకు వైభవ మండపం, పీఏసీ-1, రాంబగీచా బస్టాండ్, ఏఎన్సీ ప్రాంతాల్లో పంపిణీ చేయనున్నారు. ఆదివారం నాడు 35,000 మందికి దర్శన భాగ్యం కల్పించేందుకు టీటీడీ ముందస్తు ప్రణాళికలు రూపొందించింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి ఉద్యానవనంలోని కంపార్ట్‌మెంట్లలో ఉన్న భక్తులకు మాత్రమే దర్శనం కల్పిస్తారు. రేపు ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనం టిక్కెట్లు, సర్వదర్శనం టోకెన్లు, శ్రీవాణి టిక్కెట్లు ఉన్న భక్తులు దర్శనానికి అనుమతించబడతారు.

ఇక తిరుపతిలో సర్వదర్శనం భక్తులకు జారీ చేసే టోకెన్లను టీటీడీ నిలిపివేసింది. ఆన్‌లైన్‌లో మూడు నెలల క్రితమే జారీ చేసిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లు రేపు అమల్లో ఉండవని వివరించింది. తిరుమలకు వచ్చే భక్తులు తమ ప్రయాణ ప్రణాళికలను సరిచేసుకోవాలని.. అవసరమైన సౌకర్యాలు ముందే ఏర్పాటు చేసుకుని ఆలయ పర్యటనను ప్లాన్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.

మరోవైపు గ్రహణం ముగిసిన తర్వాత, ఎల్లుండి ఉదయం 3 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి, సంప్రదాయబద్ధంగా శుద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం స్వామివారికి ఏకాంతంగా సుప్రభాతం, తోమాల, అర్చన సేవలు నిర్వహించి, నైవేద్యం సమర్పిస్తారు. ఉదయం 6 గంటల నుంచి భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+