తిరుమలలో ఆ కార్యక్రమం మళ్లీ ప్రారంభం- నాలుగేళ్లు బ్రేక్: ఈ కేంద్రాల వద్ద అందుబాటు

Tirumala: తిరుమలలో భక్తుల తాకిడి తగ్గింది. కొద్ది రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కురుస్తోన్న భారీ వర్షాల పెద్ద ఎత్తున రైలు సర్వీసులు రద్దు కావడం, అనేక చోట్ల రోడ్లు, వంతెనలు తెగిపోవడం, జనజీవనం స్తంభించిపోవడం.. వంటి కారణాలు భక్తుల రోజువారీ సంఖ్యపై ప్రభావాన్ని చూపాయి.

ఈ నెల 3, 4 తేదీల్లో శ్రీవారిని దర్శించుకున్న వారి సంఖ్య 60 వేల లోపే ఉండటం దీనికి నిదర్శనం. 3వ తేదీన 57,817, 4వ తేదీన 57,390 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 5వ తేదీ నాడు ఈ సంఖ్య స్వల్పంగా పెరిగింది. 61,142 మంది శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 6వ తేదీ నాటికి మళ్లీ తగ్గింది.

Tirunamam on the overhead of devotees was resumed at Tirumala

శుక్రవారం నాడు 58,100 మంది ఏడుకొండలవాడిని దర్శించుకున్నారు. వారిలో 20,817 మంది తలనీలాలను సమర్పించుకున్నారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.39 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వ దర్శనానికి ఆరు నుంచి ఎనిమిది గంటల సమయం పట్టింది.

కాగా- తిరుమలలో శ్రీవారి భక్తులకు తిలక ధారణ చేసే కార్యక్రమాన్ని టీటీడీ అధికారులు పునఃప్రారంభించారు. శుక్రవారం సాయంత్రం టీటీడీ కార్యనిర్వహణాధికారి జే శ్యామలరావు దీన్ని లాంఛనంగా ప్రారంభించారు. తిరుమల ఏటీసీ సర్కిల్ వద్ద ఈవో, భక్తులకు శ్రీవారి సేవకులు తిలక ధారణ చేశారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడారు. తిరుమలలో భక్తులకు తిలక ధారణ కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. శ్రీవారి సేవకులు తిరుమలలోని ఏటీసీ, సుపథం, శ్రీవరాహస్వామి ఆలయం, కళ్యాణకట్ట, వీక్యూసీ 1, 2 ల వద్ద నిరంతరాయంగా భక్తులకు తిరునామాన్ని దిద్దుతారని అన్నారు.

2017లో టీటీడీ అధికారులు భక్తులకు ఈ తిలక ధారణ కార్యక్రమాన్ని తొలిసారిగా ప్రారంభించిన విషయం తెలిసింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన సమయంలో దీన్ని నిలిపివేశారు. అప్పటి నుంచి ఇది అమలు కావట్లేదు. దాదాపుగా నాలుగు సంవత్సరాల తరువాత మళ్లీ తిలక ధారణ కార్యక్రమం అందుబాటులోకి వచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+