స్వచ్ఛ భారత్‌ ఎమ్మెల్యే హల్ చల్ (ఫోటోలు)

తిరుపతి: ప్రజలకిచ్చిన అన్ని హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తప్పకుండా నెరవేర్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ అన్నారు. గురువారం తిరుపతి నగరంలోని దాసరిమఠం, రాయల్ నగర్, కమ్యూనిటీ హాల్, ఎంఆర్ పల్లి పాత పంచాయితీ కార్యాలయం, శ్రీక్రిష్ణనగర్ కమ్యూనిటీ హాలులో జన్మభూమి-మాఊరు కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిధిగా విచ్చేసిన ఎమ్మెల్యే వెంకటరమణ మాట్లాడుతూ రాష్ట్రంలోని పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలందరు సుఖసంతోషాల ఉండాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమన్నారు. అందులో భాగంగానే అనేక ప్రజాసంక్షేమ కార్యక్రమాలను రూపొందించారన్నారు.

జన్మభూమి-మాఊరు కార్యక్రమంలో తనతోపాటు అధికారులు అందరం మీ వద్దకే వచ్చామని మీ సమస్యలనూ మా దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామన్నారు. తిరుపతి నగరంలో ఇండ్లులేని పేదలందరి ఇండ్లు ఇవ్వాలనే ఉద్దేశ్యంతో త్వరలోనే 10వేల ఇళ్లు నిర్మించేందుకు ఏర్పాటు పూర్తి చేశామన్నారు.

మహిళలు ఏ విషయంలోనూ వెనుకబడకుండా చిన్నపాటి వ్యాపాలు చేసేందుకు వీలుగా 2 లక్షల నుండి 10 లక్షల వరకూ రుణాలు ఇవ్వనున్నామన్నారు. మీరు ఈ జన్మభూమిలో ఇచ్చే వినతిపత్రాలను స్వీకరించి వెంటనే వాటిని పరిష్కరిస్తామన్నారు.

వికలాంగులకు 500రూపాయన ఫించన్‌ను 1500 రూపాయలకు పెంచిన ఘనత చంద్రబాబునాయుడికే దక్కిందన్నారు. అంతేకాకుండా 200 రూపాయల పింఛన్‌ను వెయ్యి రూపాయలకు చేసిన ఘనత ఆయనదే అన్నారు.

Tirupathi mla venkatramana participates in swacch bharath

మిమ్మల్ని అన్ని విధాలుగా ఆదుకుంటున్న చంద్రబాబుకు మనందరం అండగా నిలిచి నూతన రాష్ట్ర ఏర్పాటులో కొండంత దైర్యాన్ని ఇవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు. జిల్లా ఆరోగ్య విభాగం అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయినపుడు 16వేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్ ఉందన్నారు.

చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన అనంతరం మొట్టమొదటగా 1,11,824 కోట్లతో నూతన బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం మన అందరికీ గర్వకారణం అని అన్నారు. రాష్ట్రంలోని ప్రజలందరూ ఆరోగ్యంగా సుఖసంతోషాలతో ఉండాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్యేయం అన్నారు.

ప్రజల వద్దకే అధికారులుస ప్రజా ప్రతినిధులు వస్తున్నారని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పాదయాత్ర సమయంలో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలను స్వయంగా చూసిన ముఖ్యమంత్రి అందిరికి న్యాయం జరిగేలా అనేక ప్రజా సంక్షేమ పథకాలనూ రూపొందిచారని అన్నారు.

ప్రజలికిచ్చిన హామీలను త్వరలోనే ముఖ్యమంత్రి నెరవేర్చుతాడన్నారు. జిల్లా టిడిపి ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో ప్రతిరోజు అన్ని డివిజన్లలో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇక ఉదయం స్వచ్చ భారత్ లో భాగంగా తిరుపతి మున్సిపాలిటీ కార్యాలయం నుండి ఇందిరా ప్రియదర్శని మార్కెట్‌ వరకు విద్యార్దులతో కలసి ఎమ్మెల్యే వెంకటరమణ, కమిషనర్ సకలారెడ్డి, అధికారులుస ప్రజా ప్రతినిధులు అవగాహన ర్యాలీ నిర్వహించారు.

ఆ తర్వాత కూరగాయల మార్కెట్లో చెత్త ఊడ్చి పచ్చదనం-పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. ఈ జన్మభూమి కార్యక్రమాల్లో మున్సిపల్ అధికారులు శ్రీదేవి, కెల్ సంజయ్, సేతు మాధవ్, ఉషా కుమారి, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+