కంటైన్‌మెంట్‌ జోన్‌గా తిరుపతి- కమిషనర్‌ ప్రకటన -వ్యాపారుల స్వీయ ఆంక్షలు

దేశవ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతోంది. పలు రాష్టాల్లో భారీ ఎత్తున కేసులు నమోదవుతున్నాయి. దీంతో చివరి అస్త్రంగా గతేడాది ప్రయోగించిన కంటైన్‌మెంట్‌ జోన్లను కేంద్రం తెరపైకి తెస్తోంది. ఏదైనా ప్రాంతంలో, పట్టణంలో లేదా నగరంలో కోవిడ్ పాజిటివిటీ రేటు పదిశాతం దాటితే దాన్ని కంటైన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించాలని కేంద్రం మార్గదర్శకాల్లో పేర్కొంది.

కేంద్రం ప్రకటించిన మార్గదర్శకాల ప్రకారం అత్యధిక పాజిటివ్‌ రేటు కలిగిన తిరుపతిని కంటైన్‌మెంట్‌ జోన్‌గా ప్రభుత్వం ప్రకటించింది. తిరుపతిలో ప్రతీ డివిజన్‌లోనూ కరోనా కేసులు ఉన్న నేపథ్యంలో కంటైన్‌మెంట్‌ జోన్‌గా తిరుపతి కమిషనర్ గిరీషా ప్రకటించారు. వైరస్ కట్టడికి ప్రజలే బాధ్యత తీసుకోవాలని ఆయన సూచించారు. కార్పోరేషన్ కార్యాలయంలో నగరంలోని వ్యాపార, వాణిజ్య వర్గాలు, రాజకీయ నేతలతో సమావేశమైన కమిషనర్‌ అనంతరం ఈ నిర్ణయం ప్రకటించారు.

tirupati announced as containment zone in wake of latest covid spread

కమిషనర్‌తో సమావేశం తర్వాత వ్యాపార వాణిజ్య వర్గాలు ఓ కీలక నిర్ణయం తీసుకున్నాయి. కంటైన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించిన నేపథ్యంలో రేపటి నుంచి మధాహ్నం రెండింటి వరకే షాపులు తెరవాలని నిర్ణయించారు. ప్రజలు కూడా ఇలాంటి స్వచ్ఛంద నిర్ణయాలు తీసుకోవాలని ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి కోరారు. నగర పరిధిలో గత రెండు నెలల్లో దాదాపు 10 వేల కేసులు నమోదైన నేపథ్యంలో అధికారుల నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. కేసులు తగ్గాక కంటైన్‌మెంట్‌ జోన్‌పై సమీక్ష చేస్తామని అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+