Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పుట్టినరోజును ఘనంగా జరుపుకున్న ఆధ్యాత్మిక నగరం తిరుపతి; జన్మదినం సీక్రెట్ ఇదే!!

మనుషులకు పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం తెలుసు కానీ, ఒక ప్రాంతానికి పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం ఎక్కడైనా చూశారా? అలా చూడాలంటే తిరుపతి నగరానికి రావాల్సిందే. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి పాదాల చెంత తిరుపతి 894 వ జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి జన్మదిన వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు.

1130 ఫిబ్రవరి 24వ తేదీన శ్రీ రామానుజాచార్యులవారు చిన్న అగ్రహారంగా ఉన్న ఈ ప్రాంతానికి తిరుపతిగా పేరుపెట్టి గోవిందరాజస్వామి ఆలయానికి శంకుస్థాపన చేసినట్టు పురాణాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే గత మూడేళ్లుగా తిరుపతి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ రోజు తిరుపతిలో కన్నుల పండుగగా జరిగిన వేడుకల విశేషాలు అన్నీ ఇన్నీ కావు. తిరుపతి జన్మదినం సందర్భంగా గోవిందరాజ స్వామి ఆలయ మాడవీధుల్లో అత్యంత వైభవోపేతంగా శోభాయాత్ర నిర్వహించారు.

Tirupati birthday celebrations; Shobhayatra is like eyefeast; this is the secret of tirupati birthday

శ్రీవారి పూజా కైంకార్యాలను నిర్దేశించిన జగద్గురు శ్రీ రామానుజాచార్యులే స్వయంగా శంకుస్థాపన చేసిన ఒక నాటి బ్రాహ్మణ అగ్రహారమైన నేటి తిరుపతి... పరపతి మరింత పెరిగేలా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి ఆధ్వర్యంలో ఈ జన్మదిన వేడుక ఘనంగా కొనసాగింది. తిరుపతి పుట్టినరోజు సందర్భంగా శ్రీ గోవిందరాజస్వామి ఆలయం వద్ద అర్చకులు, జీయర్ స్వాముల ఆశీస్సులు తీసుకుని శోభాయాత్రను టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రారంభించారు.

ఆద్యంతం కన్నుల పండుగగా సాగిన శోభాయాత్రలో వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాలు, భజన మండళ్ళ కళా ప్రదర్శనలు కట్టి పడేశాయి. చెక్క భజనలు చేస్తూ, కోలాటాలతో నిర్వహించిన కళా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. పౌరాణిక వేషధారణలతో నగరవాసులను ఆకట్టుకున్నారు. టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో కళాకారులు అనేక కార్యక్రమాలను నిర్వహించారు.

Tirupati birthday celebrations; Shobhayatra is like eyefeast; this is the secret of tirupati birthday

కనుల పండగలా కొనసాగిన ఆధ్యాత్మిక తిరుపతి శోభాయాత్ర ఆద్యంతం..గోవింద నామ స్మరణలతో మారుమోగింది. ప్రతి ఒక్కరూ తిరుపతి పట్ల, సమతామూర్తి రామానుజాచార్యుల పట్ల తమ భక్తి ప్రపత్తులు ప్రదర్శించారు. తిరుపతి జన్మదినం రోజున తిరుపతి నగరం పులకించిపోయింది. అడుగడుగునా భక్తుల నీరాజనాలు.. జయజయ ధ్వానాలతో ఆధ్యాత్మిక నగరం తిరుపతి శోభాయమానంగా దర్శనమిచ్చింది. తిరుపతి ప్రజలందరూ శోభాయాత్ర కు స్వాగతం పలికారు.

ప్రతి ఇంటికి పచ్చ తోరణాలు కట్టి, పసుపు నీళ్లు గుమ్మరించి, పువ్వులతో రామానుజాచార్యుల శోభాయాత్రకు స్వాగతం పలికారు. కర్పూర హారతులు పడుతూ భక్తి వ్యక్తం చేశారు. గుమ్మడికాయలతో దిష్టి తీశారు. జగద్గురు శ్రీ రామానుజాచార్యుల వారి చిత్రపటాలను ప్రదర్శించి తిరుపతి పుట్టుకను గుర్తు చేశారు. తిరుపతి ప్రజలంతా సమతా స్ఫూర్తి గొప్పతనాన్ని చాటుతూ ముందుకు సాగారు. పుణ్యక్షేత్రమైన తిరుపతి జన్మదినం ప్రతి సంవత్సరం ఘనంగా కొనసాగాలని జీయర్ స్వాములు ఆకాంక్షించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+