తిరుపతి లా కాలేజ్ అమ్మాయికి గంజాయి ఇచ్చి?, భర్త, కన్నింగ్ లేడీ ఏం చేశారంటే?
ఏడుకొండల స్వామి కొలువుతీరిన తిరుమల శ్రీవారి పాదలచెంత ఉన్న తిరుపతి నగరంలో గంజాయి బ్యాచ్ ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. శ్రీవారి సన్నిధి సమీపంలో ఉన్న తిరుపతి నగరంలో చదువుతున్న విద్యార్థులను తప్పుదొవపట్టించడానికి విచ్చలవిడిగా గంజాయి విక్రయిస్తున్న వారి ఆగడాలు రోజురోజుకు ఎక్కువ అవుతున్నాయని వెలుగు చూసింది. మహిళా లా కాలేజ్ లో చదువుతున్న యువతికి గంజాయి అలవాటు చేసి ఆమె మీద అత్యాచారానికి పాల్పడటం కలకలలం రేపుతోంది.
లా కాలేజ్ యువతి మీద అత్యాచారానికి పాల్పడి బ్లాక్ మెయిల్ చేసిన కేసులో దంపతులు అరెస్టు కావడంతో తిరుపతి ప్రజలు ఉలిక్కిపడ్డారు. యువతి మీద అత్యాచారానికి పాల్పడి ఆ వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేసిన కేసులో కృష్ణకిశోర్ రెడ్డి, అతని భార్య సదాశివం ప్రణవకృష్ణ అలియాస్ ప్రణవకృష్ణ (35) అరెస్టు అయ్యారని, ఈ దంపతులు ఇంకా ఎంత మంది జీవితాలు నాశనం చేశారు అని ఆరా తీస్తున్నామని తిరుపతి గ్రామీణ పోలీసులు తెలిపారు.

తిరుపతి పోలీసుల కథనం మేరకు తిరుపతి జిల్లా బాకరాపేటకు చెందిన కృష్ణకిశోర్ రెడ్డి తిరుపతిలోని ఎస్వీయూ లా కాలేజ్ లో ఎల్ఎల్ బీ చివరి సంవత్సరం చదువుతున్నాడు. కర్నూలు జిల్లా కల్లూరు మండలంలోని ఓగ్రామానికి చెందిన 22 ఏళ్ల యువతి శ్రీ పద్మావతి మహిళా కాలేజ్ లో నాలుగేళ్ల క్రితం లా కోర్సులో చేరింది. కొంతకాలం పాటు ఆ యువతి యూనివర్శిటీ లేడీస్ హాస్టల్ లో ఉండేది.
ఆ సమయంలోనే తిరుపతి గ్రామీణ మండలంలోని పుదిపట్లలో నివాసం ఉంటూ అదే లా కాలేజ్ లో చదువుతున్న సహచరి విద్యార్థిని సదాశివం ప్రణవకృష్ణ అనే మహిళతో కర్నూలు జిల్లా యువతికి పరిచయం అయ్యింది. అప్పటి నుంచి అప్పుడప్పుడు స్నేహితురాలు సదాశివం ప్రణవకృష్ణ ఇంటికి ఆ యువతి వచ్చి వెళ్లేది. అప్పటికే గంజాయికి బానిస అయిన కృష్ణకిశోర్ రెడ్డి, అతని భార్య సదాశివం ప్రణవకృష్ణ ఆ యువతికి మాయమాటలు చెప్పి ఆమెకు గంజాయి అలవాటు చేశారు.
అప్పటి నుంచి ఇంటికి వస్తున్న యువతికి ప్రతిసారి కృష్ణకిశోర్ రెడ్డి, సదాశివం ప్రణవకృష్ణ దంపతులు గంజాయి ఇఛ్చి ఆమెను మైకంలో ముంచెత్తారు. అలా ఓసారి గంజాయి మత్తులో ఉన్న యువతి మీద కృష్ణకిశోర్ రెడ్డి అత్యాచారానికి పాల్పడ్డాడు. లా కాలేజ్ లో చదువుతున్న యువతి మీద కృష్ణకిశోర్ రెడ్డి అత్యాచారం చేసే సమయంలో అతని భార్య ప్రణవకృష్ణ మొబైల్ లో వీడియోలు, ఫోటోలు తీసింది.

తరువాత యువతిని బ్లాక్ మెయిల్ చేసిన కృష్ణకిశోర్ రెడ్డి, సదాశివం ప్రణవకృష్ణ దంపతులు ఆమె నుంచి డబ్బు, బంగారు నగలు లాక్కొన్నారు. ఇటీవల కర్నూలు యువతికి పెళ్లి ఫిక్స్ అయ్యింది. యువతికి పెళ్లి జరిగితే తరువాత మేము అడిగిన డబ్బులు ఇవ్వదని ఊహించారు. ఇదే సమయంలో యువతిని బెదిరించి భారీ మొత్తంలో నగదు, నగలు ఇవ్వాలని కృష్ణకిశోర్ రెడ్డి, సదాశివం ప్రణవకృష్ణ దంపతులు ఆమెను బ్లాక్ మెయిల్ చేశారు.
అయితే తన దగ్గర ఏమాత్రం నగలు, నగదు లేదని, నేను మీకు డబ్బులు ఇవ్వలేనని ఆ యువతి తేల్చి చెప్పింది. యువతి ఎదురు తిరగడంతో కృష్ణకిశోర్ రెడ్డి కోపంతో రగిలిపోయి ఆ యువతి సోదరుడికి, ఆ యువతిని పెళ్లి చేసుకునే యువకుడికి ఆమె మీద అత్యాచారం చేసే సమయంలో తీసిన వీడియో, గంజాయి మత్తులో యువతి అర్దనగ్నంగా ఉన్న సమయంలో తీసిన ఫోటోలు పంపించారు. హడలిపోయిన యువతి కుటుంబ సభ్యులు తిరుపతి చేరుకుని కృష్ణకిశోర్ రెడ్డి, సదాశివం ప్రణవకృష్ణ దంపతుల మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తిరుపతి గ్రామీణ పోలీసులు కృష్ణకిశోర్ రెడ్డి, సదాశివం ప్రణవకృష్ణ దంపతులను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. కృష్ణకిశోర్ రెడ్డి, సదాశివం ప్రణవకృష్ణ దంపతులను లా కాలేజ్ ల నుంచి సస్పెండ్ చేశారు. కృష్ణకిశోర్ రెడ్డి, సదాశివం ప్రణవకృష్ణ దంపతులు ఇంకా ఎంత మంది జీవితాలతో చెలగాటం ఆడారు అని ఆరా తీస్తున్నామని తిరుపతి జిల్లా పోలీసులు తెలిపారు. తిరుపతిలో గంజాయి ముఠా దెబ్బకు లా కాలేజ్ అమ్మాయి జీవితం రోడ్డునపడిందని తెలుసుకున్న తిరుపతి ప్రజలు షాక్ అయ్యారు.
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications