కరోనాపై అవగాహనకు సర్వైవ్ కోవిడ్ 19 గేమ్... ఆడితే అర్ధమవుతుందట !!
కరోనాపై అవగాహన కోసం కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాయి.అయినా సరే ప్రజల్లో అవగాహన ఎంతగా ఉంది అంటే వైన్స్ తెరవగానే ఒకరిమీద ఒకరుపడుతూ మద్యం కొనుగోలు చేసేంతగా అవగాహన ఉంది . రోజూ ప్రచారం చేసినా , డప్పు చాటింపు వేయించినా, సెలబ్రిటీలు నడుం బిగించి జాగ్రత్తలు చెప్పినా వినని వారి కోసం ముఖ్యంగా యువతను టార్గెట్ చేస్తూ ఓ గేమ్ రూపొందించారు ఏపీకి చెందిన ఐఐటీ ప్రొఫెసర్ ల బృందం .
కరోనాపై అవగాహన కల్పించేందుకు ప్రపంచంలోనే తొలిసారి ఓ గేమ్ రూపొందించింది తిరుపతి ఐఐటీ ప్రొఫెసర్ శ్రీధర్ బృందం. సర్వైవ్ కోవిడ్ 19తో రూపొందించిన ఈ గేమ్‌ను రెండు సార్లు ఆడితే చాలు కరోనా జాగ్రత్తలపై అవగాహన కలుగుతుందంటున్నారు ప్రొఫెసర్ శ్రీధర్. కరోనా వ్యాధి ఇప్పట్లో మనల్ని వీడదని ప్రపంచ ఆరోగ్య సంస్థనే ప్రకటన చేసిన వేళ స్వీయ నియంత్రణ , ప్రధాని మోడీ చెప్పినట్టు ఆత్మ నిర్బంధం అవసరం .

ఇక కరోనా పై ఎంత చెప్పినా అవగాహన రాని, మాకు రాదులే అని అర్ధం చేసుకోకుండా తిరిగే యువతను టార్గెట్ చేసి గేమ్ రూపొందించారు . కరోనాపై పోరాటంలో భాగస్వామ్యం అయ్యేందుకు, వ్యాధి బారిన పడకుండా ప్రజలను రక్షించేందుకు ఈ గేమ్ తయారుచేశామంటున్న ప్రొఫెసర్ శ్రీధర్.కరోనాపై అవగాహన కల్పించేందుకు సర్వైవ్ కోవిడ్ 19 గేమ్ మరింత డెవలప్ చేస్తామని ఆయన పేర్కొన్నారు .












Click it and Unblock the Notifications