మంత్రి రోజా పై లోకేష్ సంచలన వ్యాఖ్యలు...!!

టీడీపీ నేత నారా లోకేష్ మంత్రి రోజా పై సంచలన ఆరోపణలు చేసారు.

టీడీపీ నేత నారా లోకేష్ మంత్రి రోజా పై సంచలన ఆరోపణలు చేసారు. యువగళం పాదయాత్రలో భాగంగా లోకేష్ చంద్రగిరి నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీల అమలును ప్రస్తావించారు. నాడు హామీ ఇచ్చిన విధంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేసారు. 45 ఏళ్లు నిండిన వారికి పెన్షన్ ఇవ్వాలన్నారు. అదే చేస్తే తానంతట తానుగా మైకు ఇచ్చేస్తానని చెప్పుకొచ్చారు. నిత్యావసర ధరలు పెరగటం వెనుక ప్రభుత్వ వైఫల్యం ఉందన్నారు. మంత్రి రోజాను మరోసారి జబర్దస్త్ ఆంటి అంటూ వ్యాఖ్యానించారు.

రాయలసీమను ముఖ్యమంత్రి జగన్ పట్టించుకోవటం లేదని లోకేష్ ఆరోపించారు. పెట్రోల్ డీజిల్ అన్ని ధరలు పెంచేసారని విమర్శించారు. వలంటీర్లను పంపి ఎంత గాలి పీలుస్తున్నారో కొలిచి, మనం పీల్చే గాలికి కూడా పన్ను విధిస్తారంటూ ఎద్దేవా చేసారు. జగన్ ప్రభుత్వంలో దళితులకు న్యాయం జరగటం లేదని ఫైర్ అయ్యారు. జగన్ అధికారంలోకి రాగానే బోటు ప్రమాదం..ఎల్‌జీ పాలిమార్‌.. అన్నమయ్య డ్యాంలో 62 మంది ప్రాణాలు కొట్టుకు పోయాయని నారా లోకేష్ ఆరోపించారు. అప్పర్ తుంగభద్ర కడితే రాయలసీమ రాళ్ల సీమవుతుందని.. అయినా వైసీపీ ఎంపీలు ఢిల్లీలో నోరు మెదపడం లేదని విమర్శించారు.టీటీడీ బోర్డు సభ్యుల పదవులకు సంబంధించి లోకేష్ కీలక వ్యాఖ్యలు చేసారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చెవిరెడ్డి దోచేది కొండంత మనకు ఇచ్చేది చెవిలో పువ్వంత అని విమర్శించారు.

Tirupati: Roja sells Tirumala tickets, Nara Lokesh makes strong allegations on minister

జబర్దస్త్ ఆంటి రోజా అంటూ మరోసారి రోజా వ్యాఖ్యానించారు. మంత్రి రోజా.. తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి, మంత్రి నారాయణస్వామి తిరుమల దర్శనాన్ని అమ్ముకుంటున్నారన్నారంటూ తీవ్ర ఆరోపణలు చేసారు. తిరుమలలో గంజాయి దొరకడమేంటని ప్రశ్నించారు. అసలు తిరుమలని ఎక్కడికి తీసుకుపోతున్నారని నిలదీసారు. కొద్ది రోజుల క్రితం నగరి నియోజకవర్గంలో పాదయాత్ర సమయంలో లోకేష్ ఇదే విధంగా మంత్రి రోజాను జబర్దస్త్ అంటీ అని వ్యాఖ్యానించారు. దీనికి మంత్రి రోజా ఘాటుగా సమాధానం ఇచ్చారు. తాను జబర్దస్త్ అంటీ అయితే, హెరిటేజ్ వ్యాపారం చేస్తున్న తన ఇంట్లో వారిని ఏమనాలని ప్రశ్నించారు. ఇప్పుడు మరోసారి లోకేష్ అదే తరహాలో మాట్లాడటంతో...ఇప్పుడు రోజా ఏ విధంగా స్పందిస్తారనేది చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+