తిరుపతిలో ఈదురుగాలులు, భారీ వర్షం...టిడిపి సభ ఆలస్యమయ్యే అవకాశం
తిరుపతి:తిరుపతిలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. తిరుపతి నగరంలో హఠాత్తుగా కురిసిన ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కారణంగా "నమ్మకద్రోహం - కుట్ర రాజకీయాలపై ధర్మపోరాటం" నినాదంతో టిడిపి నిర్వహిస్తున్నధర్మ దీక్ష బహిరంగ సభ కోసం ఇక్కడకు తరలివచ్చిన కార్యకర్తలు, ప్రజలు ఇబ్బందులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అలాగే ఈ సభ కోసం కోసం ఏర్పాటు చేసిన ఎల్ఈడి స్క్రీన్‌లు, ఫ్లెక్సీలు కిందకు పడిపోయాయి. ఇప్పటికే సభ కోసం తరలివచ్చినవారు వర్షం లోతడుస్తుండటంతో వారినందరిని వారు తరలివచ్చిన వాహనాల్లోనే ఉండేలా టిడిపి నేతలు సూచనలు చేశారు. మరోవైపు వాన కారణంగా జనం రాకకు అవాంతరాలు ఏర్పడటంతో ధర్మ దీక్ష సభ నిర్వహణ ఆలస్యమవడం అనివార్యంగా కనిపిస్తోంది.

ఇక ఈ సభలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే అమరావతి నుంచి బయలుదేరి వచ్చి తిరుపతికి చేరుకున్నారు. వచ్చీ రావడంతోనే నేరుగా తిరుమల వెంకటేశ్వరుని దర్శనానికి వెళ్లారు. శ్రీవారి దర్శనం అనంతరం సభ ప్రారంభానికి ముందే ఆయన సభాప్రాంగణానికి చేరుకుంటారని తెలిసింది. మరోవైపు తిరుపతిలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత తో ఎంద వేడిమి తీవ్రత చూపగా హఠాత్తుగా కురిసిన వర్షంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.
ధర్మ దీక్ష వేదికపై సీఎం చంద్రబాబుతో పాటు రాష్ట్ర మంత్రులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్టీ కార్యదర్శులతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆసీనులు కానున్నట్లు సమాచారం. మొదట సాంస్కృతిక కార్యక్రమాలతో సభను ప్రారంభించనున్నట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications