TTD: శ్రీవారి పూలతో చిత్రపటాలు, మనం తయారు చెయ్యడం పూర్వజన్మ సుకృతం, సధా భార్గవి !
తిరుమల/ తిరుపతి: టీటీడీ ఆలయాల్లో ఉపయోగించిన పుష్పాలతో దేవతామూర్తుల చిత్ర పటాలు తయారుచేసే అవకాశం రావడం మహిళలకు పూర్వజన్మ సుకృతమని టీటీడీ జెఈవో శ్రీమతి సదా భార్గవి అన్నారు. టీటీడీ ఆలయాల్లో ఉపయోగించిన పుష్పాలతో దేవతామూర్తుల చిత్రపటాలు, పేపర్ వెయిట్ లు, కీ చైన్లు తదితరాలు తయారు చేయడం కోసం టీటీడీ డాక్టర్ వైయస్ఆర్ horticulture విశ్వవిద్యాలయంతో గత నెల 13వ తేదీ ఎంఓయు కుదుర్చుకున్న విషయం తెలిసిందే.

మహిళలకు మూడు రోజుల శిక్షణ
పేరూరు సమీపంలోని చీనీ నిమ్మ పరిశోధన కేంద్రంలో మంగళవారం మహిళలకు ఏర్పాటు చేసిన మూడు రోజుల శిక్షణ కార్యక్రమానికి టీటీడీ జెఇవో శ్రీమతి సదా భార్గవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టీటీడీ ఆలయాల్లో ఉపయోగించిన పుష్పాలతో దేవతామూర్తుల చిత్ర పటాలు తయారుచేసే అవకాశం రావడం మహిళలకు పూర్వజన్మ సుకృతమని టీటీడీ జెఈవో శ్రీమతి సదా భార్గవి అన్నారు.

చిత్రపటాలు, పేపర్ వెయిట్ లు, కీ చైన్లు
టీటీడీ ఆలయాల్లో ఉపయోగించిన పుష్పాలతో దేవతామూర్తుల చిత్రపటాలు, పేపర్ వెయిట్ లు, కీ చైన్లు తదితరాలు తయారు చేయడం కోసం టీటీడీ డాక్టర్ వైయస్ఆర్ horticulture విశ్వవిద్యాలయంతో గత నెల 13వ తేదీ ఎంఓయు కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా వినియోగించిన పుష్పాలతో చిత్ర పటాలు ఇతర వస్తువులు తయారుచేసే మహిళలకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు.

టీటీడీ అగరబత్తీలకు మంచి స్పందన
ఈ సందర్భంగా
జెఈవో సధా బార్గవి మాట్లాడుతూ, టీటీడీ ఆలయాల్లో ఉపయోగించిన పుష్పాలతో తయారు చేస్తున్న అగరబత్తీలకు మంచి స్పందన వచ్చిందని సధా బార్గవి చెప్పారు. ఇదే తరహాలో దేవతామూర్తుల చిత్రపటాలు, వస్తువుల తయారీకి కూడా అనూహ్య స్పందన లభిస్తుందని శ్రీమతి సదా భార్గవి అన్నారు. మహిళలు అనుక్షణం గోవింద నామం స్మరిస్తూ పుష్పాలు సమకూర్చడం పూర్వజన్మ సుకృతంగా సధా బార్గవి ఉద్భోధించారు.

శ్రీవారి మీద భక్తీ విశ్వాసాలు
మహిళల్లో సృజనాత్మకత బాగా ఉంటుందని, అలాగే స్థానికులకు శ్రీ వేంకటేశ్వర స్వామి వారి మీద భక్తి విశ్వాసాలు ఉంటాయి కాబట్టే స్థానిక మహిళలను ఈ శిక్షణకు ఎంపిక చేశామని సధా బార్గవి చెప్పారు. ఇది స్వామి వారు తమకిచ్చిన అదృష్టంగా సంకల్పించుకుని పనిచేయాలని సధా బార్గవి చెప్పారు.

ఆదాయం కోసం, వ్యాపారం కోసం కాదు
టీటీడీ ఆదాయం కోసమో, వ్యాపారం కోసమో ఈ పని చేయడం లేదని, స్వామివారి పుష్ప ప్రసాదాన్ని భక్తులకు అందించే బృహత్తర కార్యక్రమం గా బావిస్తోందని సధా బార్గవి వివరించారు.
కార్యనిర్వహణాధికారి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో టీటీడీలో ఉపయోగించిన పుష్పాలను స్వామి వారి ప్రసాదం గా భక్తులకు అందించే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు సధా బార్గవి చెప్పారు.
Recommended Video

టీటీడీతో ఒప్పందం మా అదృష్టం
డాక్టర్ వైయస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ జానకిరామ్ వర్చువల్ గా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డాక్టర్ వైయస్సార్ విశ్వవిద్యాలయం టీటీడీ తో ఒప్పందం కుదుర్చుకోవడం సంతోషకరమైన పరిణామం అన్నారు. టీటీడీ ఆలయాల్లో వినియోగించిన పుష్పాలతో తయారు చేయబోయే చిత్రపటాలు, ఇతర వస్తువులకు భక్తుల నుంచి మంచి స్పందన వస్తుందని, ఇదో పెద్ద
పరిశ్రమగా రూపాంతరం చెందుతుందన్నారు. పశువైద్య విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ వి పద్మనాభరెడ్డి, ఉద్యాన వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ కె గోపాల్, డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ ఆర్ వి ఎస్ కె రెడ్డి, జోనల్ రీసెర్చ్ హెడ్ డాక్టర్ కె టి వి వెంకటరమణ, ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ ఈ. కరుణ శ్రీ, డైరెక్టర్ ఆఫ్ ఎక్స్టెన్షన్ డాక్టర్ బి శ్రీనివాసులు, సైంటిస్ట్ డాక్టర్
ఎం విద్యా రాణి, చీనీ నిమ్మ పరిశోధన కేంద్రం ఇంచార్జ్ డాక్టర్ నాగరాజు, టీటీడీ డిప్యూటీ ఈవో శ్రీ రమణ ప్రసాద్ పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications