సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు: గంటా మాతో కలిసారు: టీడీపీలో ఏ ఒక్క ఎమ్మెల్యే ఉండరు..!
బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేసారు. టీడీపీ ఎమ్మెల్యే గంటా తమతో మాట్లాడారని..కలిసారని స్పష్టం చేసారు. అదే విధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో విశాఖకు చెందిన ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు కలిసిన సమయంలో అన్ని విషయాలు చర్చకు వచ్చాయని చెప్పుకొచ్చారు. మొత్తం టీడీపీ ఎమ్మెల్యేలు తమతో రావటానికి సిద్దంగా ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబు చెప్పే మాటలను ప్రజలు నమ్మటం లేదని.. ఇక నుండి బీజేపీలో చేరికలు నిరంతర ప్రక్రియ అన్నారు. త్వరలో టీడీపీ ఖాళీ అవుతుందని వీర్రాజు జోస్యం చెప్పారు. విశాఖలో పలువురు మాజీ స్థానిక సంస్థల ప్రతినిధులు బీజేపీలో చేరారు. ఇతర పార్టీల నుండి అనేక మంది పెద్దలు బీజేపీలోకి రావటానికి సిద్దంగా ఉన్నారని స్పష్టం చేసారు.
గంటా మాతో కలిసారు..ఆ ముగ్గరు కూడా..
మాజీ మంత్రి..ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తమ పార్టీ నేతలతో పాటుగా తనను కలిసారని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేసారు. విశాఖకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ని విశాఖ నగరంలోని ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు కలిసారు. వారు మర్యాద పూర్వకంగా కలిసామని చెబుతున్నా..వీర్రాజు మాత్రం ఆ సమావేశంలో అన్నీ ఉన్నాయంటూ సంచలనం రేపారు. అదే విధంగా టీడీపీలోని అనేక మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని.. చంద్రబాబు ఎన్ని పర్యటనలు చేసినా..ఎన్ని మాటలు చెప్పినా..జరిగేది మాత్రం ఆగదని స్పష్టం చేసారు. అదే విధంగా..అనేక పార్టీల నుండి పలువురు బీజేపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారని..త్వరలోనే అన్నీ చూస్తారంటూ వ్యాఖ్యానించారు.
Recommended Video

టీడీపీకి స్థానం ఉండదు..
ఏపీలో రానున్న రోజుల్లో టీడీపీకి స్థానం ఉండదని సోము వీర్రాజు చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో బీజేపీ ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేసారు. మంచి రాష్ట్రంగా తీర్చి దిద్దేందుకు తమ వద్ద ప్రత్యేక ప్రణాళికలు సిద్దంగా ఉన్నాయన్నారు. తమ పార్టీ అమలు చేస్తున్న జాతీయ విధానాలను ప్రజలు ఆమోదిస్తున్నారన్నారు. బీజేపీ ఇతర పార్టీల్లాగా తాయిలాలు ఇవ్వదని..డెవలప్ మెంట్ కోసమే పని చేస్తుందని చెప్పారు. టీడీపీ ఖాళీ అవ్వటం ఖాయమని.. క్షేత్ర స్థాయి నేతల నుండి ఎమ్మెల్యేల వరకు టీడీపీ నుండి తమ వద్దకు వచ్చేందుకు సిద్దంగా ఉన్నారంటూ చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ప్రతిపక్షంగా చెప్పుకుంటున్న పార్టీ ఉనికి ఉండదని..ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థాయికి బీజేపీ చేరుతుందని సోము వీర్రాజు ధీమాగా చెబుతున్నారు.












Click it and Unblock the Notifications