జగన్‌తో అలా చెప్పారేంటి?: ఆ ఇద్దరు హామీ (పిక్చర్స్)

న్యూఢిల్లీ: రాయల తెలంగాణ, కృష్ణా నీటి అంశం మంగళవారం దేశ రాజధాని న్యూఢిల్లీలో హీట్ ఎక్కించింది. తెలంగాణ ప్రాంత రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి నేతలు ఢిల్లీలో వివిధ పార్టీల నేతలను కలిసి రాయల తెలంగాణకు అంగీకరించవద్దని కోరారు.

రాయల తెలంగాణకు మద్దతు తెలపొద్దని బిజెపి జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్‌ను టిజెఏసి నాయకులు కోరారు. చైర్మన్ కోదండరామ్ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం రాజ్‌నాథ్‌ను ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా రాయల తెలంగాణపై జరుగుతున్న చర్చ వారి మధ్య ప్రస్తావనకు వచ్చింది.

ముఖ్యమంత్రి వైఖరి, ఉద్యోగుల విభజన వంటి అంశాలపై కూడా రాజ్‌నాథ్ సింగ్ వీరిని ఆరా తీశారు. ఇందుకు కోదండరామ్ బృందం సమాధానం ఇస్తూ ఒక ప్రాంతానికే ముఖ్యమంత్రిగా ఆయన వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఉద్యోగులకు ఆప్షన్స్ ఉంటాయని, వారు కోరుకున్న రాష్ట్రాన్ని ఎంచుకోవచ్చని వివరించారు.

ఐకాస 1

ఐకాస 1

పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటుకే బిజెపి పట్టుపట్టాలని రాజ్‌నాథ్‌ను తెలంగాణ రాజకీయ ఐకాస కోరింది. దీనికి రాజ్‌నాథ్ స్పందిస్తూ తెలంగాణపై తమ పార్టీ వైఖరి స్పష్టంగా ఉందని, తమ వైఖరిలో ఎలాంటి మార్పూ లేదని అన్నారు.

ఐకాస 2

ఐకాస 2

అనంతరం ఐకాస నాయకులంతా జెడియు అధ్యక్షుడు శరద్ యాదవ్‌ను కలిశారు. తెలంగాణకు తమ పార్టీ మద్దతు ఇస్తుందని, గతంలో కూడా తాము మద్దతు పలికామని ఆయన హామీ ఇచ్చినట్లు టిజెఏసి నాయకులు చెప్పారు.

ఐకాస 3

ఐకాస 3

గతంలో జగన్ వచ్చినప్పుడు వేరే విధంగా మాట్లాడారు కదా? అని ఐకాస నాయకులు అడగ్గా అప్పుడు అంశం వేరని, తనను తప్పుదోవ పట్టించేలా మీడియా వ్యవహరించిందని ఆయన వారికి వివరణ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. కోదండరామ్ ఆధ్వర్యంలో ఐకాస నాయకులు మంగళవారం ఉదయం రాజ్‌ఘాట్‌లో బాపూజీ సమాధికి నివాళులర్పించారు.

ఐకాస 4

ఐకాస 4

సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డిని కలిశారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణను శీతాకాల సమావేశాల్లోనే బిల్లు పెట్టి ఏర్పాటు చేస్తారని భావిస్తున్నామన్నారు. రాయల తెలంగాణ తమకు వద్దని స్పష్టం చేశారు.

ఐకాస 5

ఐకాస 5

పది జిల్లాలతో కూడిన తెలంగాణను ఇవ్వకపోతే తమ ఆందోళనను ఉధృతం చేస్తామని, ఈ మేరకు తమ స్టీరింగ్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసి కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. రాయల తెలంగాణ ప్రతిపాదన వస్తే కనుక తీవ్రమైన నిరసన తెలుపుతామని తెలిపారు.

ఐకాస 6

ఐకాస 6

తెలంగాణ ఐకాస స్టీరింగ్ కమిటీ సమావేశాన్ని బుధవారం ఉదయం 9 గంటలకు నిర్వహించాలని కోదండరామ్ నిర్ణయించారు. రాయల తెలంగాణే ఖరారయ్యిందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణను ఈ సమావేశంలో నిర్ణయించనున్నారు. రాయల ప్రతిపాదనకు నిరసన తెలపాలని సూత్రప్రాయంగా తీర్మానించారు.

వెంకయ్య

వెంకయ్య

రాయల తెలంగాణను తాము అంగీకరించే ప్రసక్తి లేదని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు వెంకయ్య నాయుడు, బండారు దత్తాత్రేయ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+