ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ కు నేడే చివరితేదీ.. మిస్సయితే జరిమానా; డీటెయిల్స్ ఇవే!!
ఐటీ రిటర్న్స్ ఇంకా ఫైల్ చేయలేదా? అయితే అలాంటి వారి కోసమే ఈ అప్డేట్. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడానికి ఈరోజు ఆఖరి తేదీ. భారతదేశంలో ఉన్న పన్ను చెల్లింపుదారులు అందరు 2023- 24 ఆర్థిక సంవత్సరానికి ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి నేడే చివరి తేదీ కావడంతో, ప్రతి ఒక్కరూ ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాలని ఆదాయపు పన్ను శాఖ విజ్ఞప్తి చేసింది.
ఇప్పటివరకు 6.13 కోట్ల మంది ఐటీ రిటర్న్స్ దాఖలు చేశారని పేర్కొంది. ఐటీ రిటర్న్స్ దాఖలుకు గడువును పొడిగించే అవకాశం లేదని స్పష్టం చేసింది. గత ఏడాది జులై 31వ తేదీ వరకు 5. 83 కోట్ల మంది మాత్రమే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశారని పేర్కొని, ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే ఎక్కువ మంది ఐటీ రిటర్న్స్ దాఖలు చేసినట్టుగా వెల్లడించింది.

ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేవారు గడువులోగా రిటర్న్స్ ఫైల్ చేయకపోతే కచ్చితంగా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని, జరిమానాలు చెల్లించవలసి వస్తుందని ఆదాయపు పన్ను శాఖ పేర్కొంది. ఇన్కమ్ టాక్స్ చట్టం సెక్షన్ 139 ప్రకారం టాక్స్ పేయర్లు, పరిమితికి మించి ఆదాయం ఉన్నవారు ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాలి.
ఆదాయపు పన్ను శాఖ ఇచ్చిన గడువు లోపు ఐటీ రిటర్న్స్ దాఖలు చేయకుంటే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. 5 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి వెయ్యి రూపాయలు , మొత్తం ఆదాయం 5 లక్షల కంటే ఎక్కువ ఉన్న వ్యక్తులకు 5000 రూపాయల జరిమానా విధించబడుతుంది. ఇది పన్ను మినహాయింపులను కోల్పోయేలా కూడా చేస్తుంది.
దీనివల్ల అధికంగా పన్ను పడే అవకాశం కూడా ఉంటుంది. ఇక డిసెంబర్ 31 తర్వాత ఐటిఆర్ దాఖలు చేస్తే వారు జరిమాన కింద పదివేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అందుకే సకాలంలో ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసి జరిమానాలను తప్పించుకోవడం తో పాటుగా, పన్ను మినహాయింపులను కూడా పొందవచ్చని చెపుతున్నారు ఆదాయపు పన్ను శాఖ అధికారులు. నేడే చివరి తేదీ కావటంతో హర్రీ అప్.












Click it and Unblock the Notifications