రోజాకు మద్దతుగా రంగంలోకి వర్మ ! డైమండ్ రాణి డైలాగ్ కు ఇస్పెట్ రాజా కౌంటర్..!
ఏపీలో వైసీపీకి వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేసే పనిలో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. తాజాగా శ్రీకాకుళం జిల్లా రణస్ధలంలో జరిగిన యువశక్తి సభలో అధికార పక్షంపై విరుచుకుపడ్డారు. ఇదే క్రమంలో మహిళా మంత్రి ఆర్కే రోజాపైనా సెటైర్లు వేశారు. ఆమెను డైమండ్ రాణిగా అభివర్ణించారు. ఈ డైలాగ్ ను ఆ తర్వాత జనసేన కార్యకర్తలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
వైసీపీ మంత్రి ఆర్కే రోజాను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ వాడిన డైమండ్ రాణి డైలాగ్ పై టాలీవుడ్ దర్శక నిర్మాత రాంగోపాల్ వర్మ స్పందించారు. రోజాకు మద్దతుగా సోషల్ వార్ లోకి దిగారు. రోజాపై పవన్ వాడిన డైమండ్ రాణి డైలాగ్ కు కౌంటర్ గా ఆయన్ను ఇస్పెట్ రాజాగా అభివర్ణిస్తూ రాంగోపాల్ వర్మ ట్వీట్ పెట్టారు. అంతేకాదు మహిళను కించ పరుస్తావా అంటూ జనసేనానిని ప్రశ్నించారు. చివర్లో ఓ పీ అభిమాని అంటూ లాస్ట్ పంచ్ కూడా విసిరారు.

రాంగోపాల్ వర్మ తన ట్వీట్ లో " డైమండ్ రాణి అనే బిరుదుతో ఒకావిడని కించపరిచిన వ్యక్తికి తనుకూడా ఒక ఇస్పెట్ రాజా అని తెలుసుకోవాల్సిన కనీస జ్ఞానం ఉండాలి అని ఒక పి ఫ్యాన్ గా నేను కోరుకుంటున్నాను" అంటూ వ్యాఖ్యానించారు. తద్వారా ఓ మహిళ అయిన రోజాను కించపరిచిన పవన్ కళ్యాణ్ తాను కూడా ఇస్పైట్ రాజా అని తెలుసుకునే కనీస జ్ఞానం కలిగి ఉండాలని వర్మ కోరారు.
అయితే వర్మ ట్వీట్ కు ట్విట్టర్ లో జనసేన, టీడీపీ అభిమానుల నుంచి గట్టిగానే కౌంటర్లు పడుతున్నాయి. ముందు నువ్వేంటో తెలుసుకో అంటూ ఇరుపార్టీలు అభిమానులు, పవన్ ఫ్యాన్స్ ఘాటైన పదజాలంతో రెచ్చిపోతున్నారు. ఈ మద్య కాలంలో వరుసగా వైసీపీకి మద్దతుగా రాంగోపాల్ చేస్తున్న ట్వీట్లను గుర్తుచేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. వీటిపై ఆర్జీవీ నుంచి ఎలాంటి రియాక్షన్స్ మాత్రం లేవు.
డైమండ్ రాణి అనే బిరుదుతో ఒకావిడని కించపరిచిన వ్యక్తికి తనుకూడా ఒక ఇస్పెట్ రాజా అని తెలుసుకోవాల్సిన కనీస జ్ఞానం ఉండాలి అని ఒక పి ఫ్యాన్ గా నేను కోరుకుంటున్నాను
— Ram Gopal Varma (@RGVzoomin) January 13, 2023












Click it and Unblock the Notifications