చంద్రబాబుకు బర్త్‌డే విషెస్ చెప్పిన చిరంజీవి - మోస్ట్ హార్డ్ వర్కింగ్ లీడర్ అని ట్వీట్
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఎం జగన్ చుట్టే తిరుగుతున్న టాలీవుడ్ పెద్దల్లో మెగాస్టార్ చిరంజీవి కూడా ఒకరు. గతంలో ప్రజారాజ్యం పార్టీ తరఫున రాజకీయాలు నడిపిన చిరంజీవి ఇప్పుడు టాలీవుడ్‌లో అందరివాడుగా గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే కోవలో చిరంజీవి పలు ఆసక్తికర నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు.
టీడీపీ అధినేత, మాజీ సీఎం, విపక్ష నేత కూడా అయిన చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ మెగాస్టార్ చిరంజీవి ఓ ట్వీట్ చేశారు. ఇందులో చంద్రబాబుపై ఆయన ప్రశంసల జల్లు కురిపించారు. సాధారణంగా చంద్రబాబుతో అంతగా అనుబంధం ఉన్నట్లు కనిపించని చిరంజీవి.. ఈ ట్వీట్‌లో ఆయన్ను కీర్తిస్తూ వాడిన పదాలు చూస్తుంటే చిరంజీవిలో మార్పు కూడా కనిపిస్తోంది. దీంతో ఈ ట్వీట్ కూడా వైరల్ అవుతోంది.

చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ పెట్టిన ట్వీట్‌లో చిరంజీవి.. కష్టపడే తత్వం ఉన్న, నిబద్ధత కలిగిన రాజకీయ నేతల్లో ఒకరైన చంద్రబాబుకు హ్యాపీ బర్త్‌డే అంటూ వ్యాఖ్యానించారు. ఆయన మంచి ఆరోగ్యంతో, సంతోషంగా, దీర్ఘాయుష్షుతో ప్రజలకు సేవ చేయాలని చిరంజీవి ఆకాంక్షించారు. చిరంజీవి నుంచి అరుదుగా వినిపించే పదాలతో కూడిన ఈ ట్వీట్‌పై చంద్రబాబు ఇంకా స్పందించలేదు. చంద్రబాబు సీఎంగా ఉండగా.. ఏపీలో అంతగా కనిపించని చిరంజీవి.. వైసీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబుకు విషెస్ చెప్పడంపై చర్చ జరుగుతోంది.
Happy Birthday to one of the most hard working and committed leaders @ncbn garu. Wish you good health , happiness and long life serving people.
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 20, 2021
-
రేషన్ కార్డు దారులకు బిగ్ అలర్ట్, కీలక మార్పులు..!! -
రూ.294.20 కోట్లతో రిటైనింగ్ వాల్.. మాట నిలబెట్టుకుంటున్న మంత్రి లోకేష్ -
ఏపీలో రైతులకు క్యూఆర్ కోడ్ తో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ.. చంద్రబాబు తీపికబురు! -
Chandrababu: ప్రజల మధ్యే అధికారులకు బాబు వార్నింగ్...! 1995ను గుర్తుచేస్తూ..! -
ఎమ్మెల్యేలు కావాలనుకునే మహిళలు సిద్ధంగా ఉండండి -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!!












Click it and Unblock the Notifications