సీఎం తో భేటీకి హాజరయ్యే హీరోలు వీరే- కాసేపట్లో తాడేపల్లికి : నివేదిక సిద్దం - టిక్కెట్లు కొత్త ధరలు ఇలా..!!
కొంత కాలంగా టాలీవుడ్ వర్సెస్ ఏపీ ప్రభుత్వం అన్నట్లుగా సాగిన వివాదానికి ముగింపు లభించనుంది. సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారానికి నేరుగా సీఎం జగన్ రంగంలోకి దిగారు. సమస్యలపైన చర్చల కోసం గత నెలలో మెగాస్టార్ చిరంజీవి ఏపీ సీఎం జగన్ ఆహ్వానం మేరకు తాడేపల్లి వచ్చారు. ఇద్దరి మధ్య లంచ్ మీటింగ్ లో ఈ సమస్యల పరిష్కారం పైన చర్చ సాగింది. ఇదే సమయంలో ప్రభుత్వం సినిమా టిక్కెట్ల వ్యవహారం పైన ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ నివేదిక తుది ముసాయిదా సిద్దం అయ్యే నాటికి మరోసారి భేటీ కావాలని సీఎం జగన్ - చిరంజీవి నిర్ణయించారు.

అమరావతికి సినీ ప్రముఖులు
అందులో భాగంగా కమిటీ నివేదిక సిద్దం అయింది. దీని పైన చర్చించేందుకు తెలుగు సినీ ప్రముఖులు మరి కాసేపట్లో సీఎం జగన్ తో సమావేశం కానున్నారు. గతంలో చిరంజీవి ఒక్కరే ఈ సమావేశానికి సినీ ఇండస్ట్రీ నుంచి ప్రముఖ హీరోలతో పాటుగా దర్శక - నిర్మాతలు సైతం హాజరు కానున్నారు. కోవిడ్ కారణంగా అందరూ కాకుండా.. కొందరు మాత్రమే వచ్చేలా చూడాలని ప్రభుత్వం నుంచి చిరంజీవికి సమాచారం ఇచ్చారు.
ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి అందుతన్న సమాచారం మేరకు ఉదయం 11 గంటలకు సీఎం క్యాంపు కార్యాలయంలో సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి చిరంజీవి...మహేష్ బాబ..ప్రభాస్.. రాజమౌళి..కొరిటాల శివ... ఆర్ నారాయణ మూర్తి రానున్నట్లు తెలుస్తోంది.

ప్రభుత్వ కమిటీ నివేదిక సిద్దం
ప్రభుత్వం కమిటీ చేసిన సిఫార్సులతో పాటుగా సినిమా టిక్కెట్ల ధరలు... థియేటర్ల నిర్వహణ కోసం ప్రభుత్వం నుంచి రాయితీలు - ప్రోత్సాహకాల పైన సీన రంగ ప్రముఖులు సీఎం ముందు ప్రతిపాదనలు ఉంచే అవకాశం ఉంది. ఇక, సినిమా టికెట్ల ధరలపై ప్రభుత్వానికి కమిటీ బుధవారం రాత్రి నివేదిక సమర్పించినట్లు సమాచారం.
అందులో చేసిన సిఫార్సుల మేరకు ఏసీ థియేటర్లలో కనీస ధర రూ.40, గరిష్ఠ ధర రూ.150గా ఉండాలని ప్రభుత్వానికి కమిటీ సిఫార్సు చేసిందని తెలుస్తోంది. ఎయిర్‌కూల్ థియేటర్లకు కనీస ధర రూ.40, గరిష్ఠ ధర రూ.120గా ఉండాలని కమిటీ సూచన చేసినట్లుగా సమాచారం. అదే విధంగా.. నాన్ ఏసీ థియేటర్లలో కనీస ధర రూ.30, గరిష్ఠ ధర రూ.70గా ఉండాలన్న కమిటీ సిఫార్సుల పైన ఈ రోజు చర్చించనున్నారు.

సినీ ఇండస్ట్రీ ప్రతిపాదనలకు సైతం
కమిటీ నివేదిక... సిఫార్సుల పైన చర్చించి సినీ ప్రముఖుల అభిప్రాయాలను సేకరించనున్నట్లుగా ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇదే సమయంలో సినిమా టికెట్ ధరలపై నేడు హైకోర్టు డివిజనల్ బెంచ్ లో విచారణ జరగనుంది. కమిటీ నివేదిక అంశాలను సైతం ప్రభుత్వం కోర్టుకు నివేదించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే మూడుసార్లు సమావేశమై టికెట్ ధరలపై కమిటీ చర్చించింది. తొలుత జూనియర్ ఎన్టీఆర్ సైతం వస్తున్నారనే ప్రచారం సాగినా...ఈ రోజు సమావేశానికి వచ్చే తుది జాబితాలో ఆయన పేరు లేదు.
Recommended Video

ప్రభాస్ - మహేష రాక వెనుక
దీని వెనుక పలు కారణాలు ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఇక, ఈ రోజు జరిగే సమావేవం ద్వారా సినిమా పరిశ్రమ సమస్యల పరిష్కారా నికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. దీంతో...సీఎం ముందు సినీ హీరోలు ఎటువంటి ప్రతిపాదనలు చేస్తారు.. సీఎం ఎలా స్పందిస్తారు..జగన్ వారి ముందు ఎటువంటి అంశాలను ప్రస్తావిస్తారనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది. అయితే, ప్రత్యేకించి మహేష్ బాబు - ప్రభాస్ ఈ చర్చల్లో పాల్గొనేందుకు రావటం వెనుక టాలీవుడ్ పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కు సిద్దమైంది. అయితే, ఈ భేటీలో హీరోల పాత్ర ఎలా ఉండ బోతోందనేది ఇప్పుడు చర్చు కారణమైంది.












Click it and Unblock the Notifications