Chandrababu-Bandla Ganesh: చంద్రబాబుతో బండ్లగణేష్ భేటీ-పాదయాత్రపై చర్చ..!
టాలీవుడ్ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ (bandla ganesh) ఇవాళ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని (Chandrababu) కలుసుకున్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో సీఎం ఛాంబర్ కు వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. చంద్రబాబు మరోసారి సీఎం అయితే తిరుపతికి పాదయాత్ర చేస్తానని మొక్కుకుని, తాజాగా దాన్ని పూర్తి చేసుకున్న బండ్లగణేష్ ... ఆ విశేషాలను ముఖ్యమంత్రితో పంచుకున్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని అసెంబ్లీలోని ఆయన ఛాంబర్‌లో టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ కలిశారు. వైసీపీ ప్రభుత్వం చంద్రబాబుపై 2023లో అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపిన సమయంలో .. సీఎం చంద్రబాబు జైలు నుంచి విడుదలై ముఖ్యమంత్రి అయితే తిరుమలకు పాదయాత్రగా వస్తానని బండ్ల గణేష్ మొక్కుకున్నారు. అనంతరం 2024లో జరిగిన ఎన్నికల్లో కూటమి విజయం సాధించి చంద్రబాబు నాలుగోసారి సీఎంగా అధికారం చేపట్టారు. దీంతో బండ్లగణేశ్ మొక్కు తీర్చుకున్నారు.

సంకల్ప యాత్ర పేరుతో తెలంగాణలోని షాద్‌నగర్ లోని తన ఇంటి నుంచి జనవరి 19న పాదయాత్ర మొదలుపెట్టిన బండ్లగణేష్.. ఈ నెల 10వ తేదీన తిరుమలకు చేరుకున్నారు. ఈ లెక్కన 23 రోజుల పాటు 535 కి.మీ మేర బండ్ల గణేష్ పాదయాత్ర సాగింది. రెండ్రోజుల క్రితం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న బండ్ల గణేష్.. తన మొక్కును చెల్లించుకున్నారు. ఈ నేపథ్యంలో అమరావతికి వచ్చి సీఎం చంద్రబాబును కలిశారు. తిరుమల నుండి తీసుకువచ్చిన శ్రీవారి ప్రసాదాన్ని అందజేశారు. బండ్ల గణేష్‌ను సీఎం చంద్రబాబు ఆత్మీయంగా పలకరించి ఆలింగనం చేసుకున్నారు. పాదయాత్ర సాగిన తీరును సీఎంతో బండ్ల గణేష్ పంచుకున్నారు. తన పాదయాత్రలో దారి పొడవునా పార్టీ కార్యకర్తలు అండగా నిలిచి తనతో నడిచారని, వారి ప్రోత్సాహంతో తాను మరింత ఉత్సాహంగా నడుస్తూ తిరుమలకు చేరుకున్నానని బండ్ల గణేష్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications