Tirumala Laddu: లడ్డూ దోషుల్ని తీవ్రవాదులతో పోల్చిన హీరో సుమన్ !షాకింగ్ కామెంట్స్..
తిరుమల లడ్డూను వైసీపీ హయాంలో కల్తీ చేశారన్న ప్రచారంలో వాస్తవం ఉందో లేదో తెలియదు కానీ శ్రీవారి భక్తుల్లో మాత్రం ఇది తీవ్ర ఆగ్రహావేశాలు నింపుతోంది. ఈ నేపథ్యంలో శ్రీవారి భక్తులు ఒక్కొక్కరిగా ఈ వ్యవహారంపై స్పందిస్తున్నారు. ఇదే క్రమంలో ఇవాళ అనంతపురం వచ్చిన టాలీవుడ్ వెటరన్ హీరో సుమన్.. లడ్డూ కల్తీపై సంచలన విమర్శలు చేశారు. దోషుల్ని శిక్షించే విషయంలో టీటీడీకి కీలక సూచన చేశారు.
తిరుమల లడ్డూ కల్తీ అయిన అంశంపై టాలీవుడ్ హీరో సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతపురం జిల్లా గుంతకల్లులో జరిగిన ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న సుమన్ ఈ వివాదంపై స్పందించారు. అయితే ప్రస్తుతం సిట్ విచారణ జరుగుతోందని, లడ్డూ కల్తీ నిజమని తేలితే మాత్రం దోషుల్ని ఉగ్రవాదుల తరహాలో శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన టీటీడీ ముందు డిమాండ్ పెట్టారు.

మరోవైపు తిరుమల దర్శనానికి వెళ్లే వారి డిక్లరేషన్ అంశం వ్యక్తిగతంగా ఆలోచించుకోవాలని సుమన్ సూచించారు. కానీ లడ్డూ కల్తీ అన్నది సామాన్యమైన విషయం కాదన్నారు. కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించారని సుమన్ ఆరోపించారు. ఈసారి టీటీడీలో అధికారుల్ని, పాలక మండలి నియామకంలో రాజకీయ నేతలకు చోటు కల్పించవద్దని కోరారు. వారికి బదులు భక్తి భావం ఉన్న వారినే నియమించాలన్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా కఠినాతి కఠినమైన శిక్షలు వేయాలని సుమన్ డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications