బలుపెవడికెక్కువుండాల్రా - తప్పేంట్రా.. బడా చోర్..: సినీ ఇండస్ట్రీ వర్సస్ వైసీపీ-వార్ పీక్..!!
ఏపీలో సినిమా టిక్కెట్ల ధరల తగ్గింపు వ్యవహారం ముదరుతోంది. ఇది ప్రభుత్వం వర్సెస్ తెలుగు సినీ ఇండస్ట్రగా మారి..ఇప్పుడు వైసీపీ నేతల మీదకు మళ్లుతోంది. తాజాగా నెల్లూరు జిల్లా కోవూరు వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సినీ పరిశ్రమ పైన కొన్ని వ్యాఖ్యలు చేసారు. వాటికి సినీ ఇండస్ట్రీ నుంచి ఈ రోజున పరోక్షంగానే ఊహించని విధంగా స్పందన వచ్చింది. కొద్ది రోజులు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మార్చుకోవాలంటూ కొందరు సీనియర్ హీరోలు ట్వీట్లు.. ఈవెంట్ల వేడుకల్లో కోరుతూ వస్తున్నారు. హీరో నాని లాంటి వారు నేరుగా వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఇక, ఇదే సమయంలో నాని లాంటి వారి వ్యాఖ్యలకు మంత్రులు సైతం అదే స్థాయిలో కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా ఆర్జీవీ ట్వీట్లతో షేక్ చేసారు. మంత్రి ఆహ్వానం మేరకు అమరావతి వెళ్లి.. మంత్రి పేర్ని నానితో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. కానీ, ఏం ఫలితం రాలేదు. మరలా ఆర్జీవీ ట్వీట్లు ప్రారంభించారు. ఇదే సమయంలో నందమూరి హీరో బాలయ్య సైతం ఈ అంశంలో సినీ ఇండస్ట్రీ అంతా ఒక్కటిగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇక, ఇప్పుడు తాజాగా దర్శకుడు వీ ఎన్ ఆదిత్య ఒక పోస్టు పెట్టారు. అందులో ఆయన ఎవరి పేరు ఉద్దేశించ లేదు. ఎవరి గురించో చెప్పలేదు. పరోక్షంగా తాను చెప్పదలచుకున్నది..అనదలచుకున్నది అనేసారు..చెప్పేసారు. ఆయన పోస్టులో ఏం రాసారో యధాతధంగా...

నీ వాపుకి పదవీ కాలం పదవిలో ఉన్న అయిదేళ్లే..సినిమా వాడి బలుపుకి పదవీ కాలం భూమి మీద తెలుగు వాడు ఉన్నంత కాలం.. గుర్తుంచుకో.. సినిమా ప్రపంచం మొత్తాన్ని నీ ఇంటికి తెచ్చి చూపిస్తుంది..
నీ జీవిత కాలంలో నూట యాభై రూపాయలకి నీ ఇంట్లో వాళ్లందరికీ ప్రపంచాన్ని చూపించగలవా..చవట సన్నాసీ.. అంటూ మరీ ఆగ్రహం ఎక్కువగా ప్రదర్శించారు. రాజకీయ నేతలతో పోల్చుకుంటూ ఆయన చేసిన పోస్టింగ్ ఇప్పుడు వైరల్ అవుతోంది. సినిమాల్లో రాణిస్తే దేవుడవుతాడు.. రాజకీయాల్లో రాణిస్తే రాజవుతాడు.. అంటూ కామెంట్ చేసారు. ఇక, దీని పైన ఎటువంటి రియాక్షన్స్ వస్తాయనేది చూడాలి.












Click it and Unblock the Notifications