వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
చిత్ర పరిశ్రమను హైదరాబాద్ నుంచి తరలిస్తాం: బాలకృష్ణ
అమరావతి: చిత్ర పరిశ్రమను హైదరాబాద్ నుంచి తప్పక అమరావతికి తరలిస్తామని సినీహీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చెప్పారు. అయితే దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు.
సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారానికి శాసనసభ ఒక మంచి వేదిక కావాలని అభిప్రయపడ్డారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి అసెంబ్లీ సమావేశాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు.

అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ అనే తేడా లేకుండా అందరూ ప్రజా సమస్యల పరిష్కారానికి ఐక్యంగా కృషి చేయాలని ఎమ్మెల్యే బాలకృష్ణ పిలుపునిచ్చారు.