ఈ రైళ్లు జీవితంలో ఒక్కసారన్నా ఎక్కాలి!

సౌకర్యవంతమైన ప్రయాణానికి చిరునామాగా భారతీయ రైల్వే నిలిచింది. దేశవ్యాప్తంగా కొన్ని వేల కిలోమీటర్ల విస్తరించిన రైల్వే ట్రాక్స్ ద్వారా ప్రయాణికులతోపాటు సరకు రవాణా కూడా అవుతోంది. పర్యాటకుల కోసం రైల్వే ప్రత్యేకంగా రూపొందించిన రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. అవి చూసిన తర్వాత ఒక్కసారైనా ఈ రైలులో జర్నీ చేయాలనిపించేలా ఉంటాయి. అవి ఏమిటో పరిశీలిద్దాం.

డెక్కన్ ఒడిస్సి: రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ ఈ రైలును 2005లో ప్రారంభించారు. మహారాష్ట్ర టూరిజాన్ని అభివృద్ధి చేసేందుకు దీన్ని తీసుకువచ్చారు. ఆయుర్వేదిక్ స్పా, మినీ జిమ్, సమావేశ మందిరం, సెలూన్, బార్, డైనింగ్ కారు లాంటి అదనపు హంగులున్నాయి. మహారాష్ట్ర స్ల్పెండర్, హిడెన్ ట్రెజర్స్ ఆఫ్ గుజరాత్, జెవెల్ ఆఫ్ ది డెక్కన్, మహారాష్ట్ర వైల్డ్ ట్రయల్, ఇండియన్ ఒడిస్సి, ఇండియన్ సోజోర్న్ పేర్లతో ఈ రైలుబండి సేవలు అందుబాటులో ఉన్నాయి.

top 5 indian luxury and tourism trains

మహారాజ ఎక్స్‌ప్రెస్: ఇది ఐఆర్ సీటీసీ అందిస్తున్న ఒక లగ్జరీ రైలు. ప్రెసిడెన్షియల్ సూట్స్, జూనియర్ సూట్ క్యాబిన్స్, డీలక్స్ క్యాబిన్స్ వంటి సౌకర్యాలు ఈ రైలు సొంతం. రంగ్ మహల్, మయూర్ మహల్ పేర్లతో రెండు లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్నాయి. రంగ్ మహల్ అనేది రెడ్ ఫోర్ట్‌లోని రంగ్ మహల్‌ని పోలి ఉంటుంది. మయూర్ మహల్ అనే రెస్టారెంట్ మయూరం థీమ్‌లో ఉంటుంది.

రాయల్ రాజస్తాన్: భారతీయ రైల్వే సహకారంతో రాజస్థాన్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఈ రైలును రూపొందించింది. రాజస్తాన్‌లోని ప్రముఖ పర్యాటక క్షేత్రాలతో పాటు ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రా, వారణాసి, మధ్యప్రదేశ్‌లోని ఖజురహో వంటి పర్యాటక క్షేత్రాలను కూడా ఈ రైలు బండి కవర్ చేస్తుంది.

ప్యాలెస్ ఆఫ్ వీల్స్: ప్రపంచస్థాయి సౌకర్యాలతో మొట్టమొదటి లగ్జరీ రైలుబండిగా దీనికి పేరుంది. ఆధునిక సౌకర్యాలన్నీ అందుబాటులో ఉంటాయి.

రాయల్ ఓరియంట్ : గుజరాత్ టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్, ఇండియన్ రైల్వేస్ సంయుక్తంగా ఈ రైలు బండిని రూపొందించాయి. 1994-95లో ఇది ప్రారంభమైంది. గుజరాత్, రాజస్తాన్ రాష్ట్రాల్లోని పర్యాటక కేంద్రాలను ఇది అనుసంధానం చేస్తుంది. 7 నైట్స్, 8 డే టైమింగ్స్ తో జరిగే ఈ రైలు ప్రయాణం అద్భుతం అనిపిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+