వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నగరిలో మంత్రి రోజా కు గెలుపు కష్టమేనా - గట్టెక్కించేది అదొక్కటే..!!

|
Google Oneindia TeluguNews

మంత్రి రోజా సొంత నియోజకవర్గంలో సమీకరణాలు మారుతున్నాయి. మంత్రి రోజా కు సొంత పార్టీ నుంచే సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో, 2024 ఎన్నికల్లో నగరిలో రోజా గెలవాలంటే ప్రత్యర్ధి పార్టీల కంటే సొంత పార్టీపైనే ఎక్కువగా పోరాటం చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయని చెబుతున్నారు. నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితుల పైన తాజాగా మంత్రి రోజా ఆవేదన వ్యక్తం చేసారు. ఇలాగే ఉంటే రాజకీయం చేయలేమంటూ వ్యాఖ్యానించారు. మంత్రి రోజా 2014, 2019 ఎన్నికల్లోనూ స్వల్ప మెజార్టీతోనే గెలుపొందారు. 2019 ఎన్నికల్లో రోజా వరుసగా నగరి నుంచి రెండో సారి గెలుపొందారు. ఆ సమయంలోనే రోజా కు వ్యతిరేకంగా నియోజకవర్గంలో ఒక వర్గం పని చేసింది. నియోజకవర్గంలో రోజా వ్యతిరేక వర్గం గతం కంటే మరింతగా బలపడింది.

మంత్రికి అసమ్మతి నేతలే సమస్య
రెండో సారి గెలిచిన సమయం నుంచి రోజాకు వ్యతిరేక వర్గం నియోజకవర్గంలో బలం పెంచుకొనే ప్రయత్నం చేస్తోంది. వారికి పార్టీలోని కొందరు ముఖ్య నేతల మద్దతు ఉందని రోజా వర్గీయులు చెబుతున్నారు. నిండ్ర మండలానికి చెందిన చక్రపాణిరెడ్డి పార్టీలో పట్టు ఉంది. దీంతో, వచ్చే ఎన్నికల్లో రోజా తిరిగి నగరి నుంచి పోటీ చేసినా..పార్టీలోని వ్యతిరేకులు ఎంత వరకు సహకరిస్తారనేది సందేహంగా మారుతోంది. నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేస్తున్న సీఎం జగన్ నగరి నియోజకవర్గం పైన సమీక్షలో మంత్రి రోజా - నియోజకవర్గంలోని అసమ్మతి వర్గానికి ఏం చెబుతారనేది తేలిపోనుంది. అయితే, రోజాకు ఇప్పటి వరకు సొంత పార్టీలో వ్యతిరేకత ఉన్నా, కలిసి వచ్చే అంశం మాత్రం ఊరటనిస్తోంది.

Tough fight for minister Roja in Nagari, this is the only advantage for her

సీఎం జగన్ - చంద్రబాబుకు కీలకం
ఇక్కడ టీడీపీ నుంచి గాలి భానుప్రకాశ్ కు పార్టీ అధినేత చంద్రబాబు బాధ్యతలు అప్పగించారు. 2019 ఎన్నికల్లో రోజా మీద పోటీ చేసిన భాను ఓడిపోయారు. తిరిగి పోటీ చేసేందుకు సిద్దమవుతున్నారు. కానీ, ఆయన సోదరుడు జగదీష్ వ్యతిరేకంగా మారటం వైసీపీకి కలిసి వచ్చే అంశం. గాలి కుమారులిద్దరూ కలిసి పార్టీ కోసం పని చేయాలని టీడీపీ అధినేత నిర్దేశించారు. 2024 ఎన్నికల్లో రోజా ఎట్టి పరిస్థితుల్లో గెలవకూడదనేది చంద్రబాబు లక్ష్యం. గెలిపించుకోవటం సీఎం జగన్ బాధ్యత అన్నట్లుగా పరిస్థితి మారింది. కానీ, క్షేత్ర స్థాయిలో నగరి టీడీపీలో సఖ్యత కనిపించటం లేదు. ఇటు మంత్రి రోజా కు వ్యతిరేకంగా నియోజకవర్గంలో బలమున్న నేతలు ఒక్కటవుతున్నారు.

Tough fight for minister Roja in Nagari, this is the only advantage for her

నగరిలో మారుతున్న పరిస్థితులు
మంత్రి రోజా తమను నియోజకవర్గంలో పట్టించుకోవటంలేదని వారు సీఎం వద్ద ఫిర్యాదు చేసేందుకు సిద్దమవుతున్నారు. ముఖ్యమంత్రి జగన్ తనకు అండగా నిలుస్తారని రోజా విశ్వసిస్తున్నారు. నియోజవర్గంలోని నిండ్ర, విజయపురం మండలాల్లో రోజాకు సొంత పార్టీ నేతల వ్యతిరేకత ఎక్కువగా ఉందని తెలుస్తోంది. దీంతో.. ఇప్పుడు 175 సీట్లు గెలవాలనే లక్ష్యంతో ఉన్న సీఎం జగన్ కు తన కేబినెట్ ఫైర్ బ్రాండ్ రోజా నియోజకవర్గంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఆసక్తి కరంగా మారుతోంది.

English summary
AP Minister Roja facing Tough situation in own constitunecy Nagari, party own leaders differ with Roja.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X