ఘోర రోడ్డు ప్రమాదం: పెళ్లి ట్రాక్టర్ బోల్తా పడి ఆరుగురు మృతి, 19 మందికి గాయాలు

చిత్తూరు: జిల్లాలోని పూతలపట్టు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లక్ష్మయ్యఊరులో పెళ్లి ట్రాక్టర్ బోల్తా పడి ఆరుగురు మృతి చెందారు. మరో 19 మంది గాయాలపాలయ్యారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు.

పూతలపట్టు మండలం జట్టిపల్లిలో ట్రాక్టర్‌పై పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి వెళ్లి సహాయ చర్యలు చేపట్టారు. గాయపడినవారిని తిరుపతి స్విమ్స్, వేలూరు సీఎంసీకి తరలించారు.

 Tractor Overturned in Chittoor district: 6 killed, 19 injured

మృతులు ఐరాల మండలం బలిజపల్లికి చెందినవారిగా గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో బలిజపల్లికి చెందిన 26 మంది ట్రాక్టర్‌లో ఉన్నారు. అతివేగం కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య

విశాఖపట్నం జిల్లాలోని మర్రిపాలెం రైల్వేస్టేషస్టే న్ వద్ద ఓ యువకుడి మృతదేహన్ని పోలీసులు గుర్తించారు. మృతుడు ఇంజినీరింగ్ చదువుతున్న పవన్‌గా గుర్తిం చారు. పవన్ వద్ద లభించిన ఆధారాలతో రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. ఆత్మహత్యకు ముందు సెల్ఫోన్ నుంచి తల్లిదంల్లి డ్రులకు.. 'మిమ్మల్ని బాధపెట్టాను... సుమారు లక్ష వరకు అప్పు చేశాను' అనిమెసేజ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. తన వల్ల భవిష్యత్తులోనూ తల్లిదండ్రులకు ఇబ్బం దులు తప్పవంటూ.. 'నాన్నా ఐ లవ్యూ' అని మెసేజ్ పంపినట్లు పోలీసులు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+