పంద్రాగస్టు: హైదరాబాద్‌లో ట్రాఫిక్ నియంత్రణ ఇలా...

Traffic regulations in Hyderabad during independence day celebrations
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత మొట్టమొదటి సారిగా గోల్కొండ కోటలో జరగనున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు గట్టి భద్రతా ఏర్పాట్లు చేపట్టనున్నట్లు నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి వెల్లడించారు. సాయుధ బలగాలు బుధవారంనాడు రిహార్సల్ చేశాయి.

మొట్టమొదటి సారిగా గోల్కొండ కోటలో జరగనున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు భారీగా భధ్రత ఏర్పాట్లు చేపట్టనున్నట్లు మహేందర్ రెడ్డి బుధవార మీడియాకు తెలిపారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి మూడు రూట్లలో గోల్కొండ కోటకు వివిఐపిలు, విఐపిలను అనుమతించేందుకు వీలుగా ప్రత్యేకంగా పాస్‌లను జారీ చేసి, వారి వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేకంగా స్థలాలను కూడా కేటాయించినట్లు వివరించారు.

పంద్రాగస్టు రోజున ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం పనె్నండు గంటల వరకు రాందేవ్‌గూడ మీదుగా గోల్కొండ వైపు వచ్చే సాధారణ ట్రాఫిక్‌ను అనుమతించబోమని, రాందేవ్‌గూడ నుంచి గోల్కొండ కోటకు వెళ్లే దారిలో ‘వన్‌వే'ను అమలు చేస్తామన్నారు.

ఉదయం ఏడుగంటల నుంచి పది గంటల మధ్య ఏబిసిడి పాస్ స్టిక్కర్లు కల్గిన వాహానాలను మాత్రమే పార్కింగ్ కోసం అనుమతించనున్నారు. ఏబిసిడి పాస్ స్టిక్కర్లు ఉన్న విఐపిలను బంజారాహిల్స్, మాసాబ్‌ట్యాంక్, మెహిదీపట్నం, రేతీబౌలీ, నానల్‌నగర్ జంక్షన్ నుంచి ఎడమవైపు నుంచి బాలికాభవన్, ఆంధ్రారోల్ మిల్స్, లంగర్‌హౌజ్ ఫ్లైవోవర్ మీదుగా రాందేవ్‌గూడ వరకు, అక్కడి నుంచి కుడివైపు కోటలోకి అనుమతించనున్నట్లు తెలిపారు. ఈ రకంగా వాహానాల్లో ‘ఏ' పాస్ స్టిక్కర్లున్న వాహానాలను కోట నుంచి కేవలం మంద మీటర్ల దూరంలో ఉన్న బస్టాపులో అనుమతించనున్నట్లు తెలిపారు. ‘బి' పాస్ కల్గిన వాహానాలను కోట ముందున్న మెయిన్‌రోడ్డుపై పార్కింగ్ చేసుకోవచ్చునని తెలిపారు.

‘సి' పాస్‌లున్న వాహనాలు బస్టాపు వెనకానున్న గోల్కొండ ఏరియా ఆస్పత్రి సమీపంలో పార్కింగ్ చేసుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ‘డి' పాస్‌లున్నన వారు కోట నుంచి 300 మీటర్ల దూరంలో ఉన్న ప్రియదర్శిని హై స్కూల్ వద్ధ పార్కింగ్ వసతి కల్పించినట్లు కమిషనర్ మహేందర్‌రెడ్డి తెలిపారు. వీటితో పాటు ‘ఇ' పేరున్న పాస్‌లున్న వారు బంజారీదర్వాజ సమీపంలోని సెవెన్‌టూంబ్స్ నుంచి బంజారీదర్వాజ నుంచి లోపలికి వచ్చి ఎడమవైపు తిరిగి, గోల్కొండ పోలీస్‌స్టేషన్‌కు సమీపంలో ఉన్న ఓవైసీ జిహెచ్‌ఎంసి ప్లే గ్రౌండ్‌లో పార్కింగ్ చేసుకోవాలని సూచించారు.

‘ఏఫ్' పాస్‌లు కల్గిన సందర్శకులు తమ వాహనాలను గోల్కొండపోలీస్‌స్టేషన్ ముందున్న హాకీగ్రౌండ్స్‌లో పార్కింగ్ చేసుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు.

* ఇతర పార్కింగ్ స్టిక్కర్లు కల్గిన సందర్శకులు, బంజరాహిల్స్ నుంచి వచ్చే వాహానాలు ఫతేదర్వాజ మీదుగా గానీ, బంజరాదర్వాజ మీదుగా గానీ వచ్చి హుడా పార్క్‌లో వాహనాలను పార్కింగ్ చేసుకోవచ్చునని సూచించారు. ఈ రెండు గేట్ల వరకు సాధారణ సందర్శకులను తీసుకువచ్చే బస్‌లను కూడా అనుమతించనున్నట్లు తెలిపారు.

* వేడుకలు ముగిసిన తర్వాత ఏబిసిడి స్టిక్కర్లు కల్గిన వాహానాలను మక్కా గేటు, రాందేవ్‌గూడమీదుగా వెళ్లాలని సూచించారు. అలాగే ‘ఇ, ఎఫ్ స్టిక్కర్లున్న వాహనాలు బంజారాగేటు, సెవెన్‌టూంబ్స్ మీదుగా వెళ్లాలని కమిషనర్ సూచించారు.

* సికిందరాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో కూడా వేడుకలు జరగనున్నందున టివోలి జంక్షన్ నుంచి వచ్చే వాహానాలను ఎన్‌సిసి జంక్షన్ మీదుగా దారి మళ్లించి, ఉదయం ఎనిమిది నుంచి తొమ్మిది గంటల మధ్య ఆంక్షలను అమలు చేయనున్నట్లు కమిషనర్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+