నంద్యాల‌లో తీవ్ర విషాదం.. మిద్దెకూలి న‌లుగురు మృతి..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని నంద్యాల జిల్లా చాగల్లమర్రిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. చినవంగలి గ్రామంలోమట్టిమిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత ప‌డ్డారు. చనిపోయిన వారిలో ఇద్ద‌రు చిన్నారుల‌తో భర్త, భార్య కూడా ఉన్నారు. శిథిలాల కింద ప‌డి ఉన్న మృతదేహాలను స్థానికులు వెలికి తీసే ప్ర‌య‌త్నంలో ఉన్నారు. ఈ సంఘ‌ట‌న చాగలమర్రి మండలం చిన్న వంగలిలో చోటుచేసుకుంది.

చనిపోయిన వారిని గురుశేఖర్‌రెడ్డి (45), దస్తగిరమ్మ (38) దంపతులు ఉండ‌గా, వారి ఇద్దరు కుమార్తెలైన‌ పవిత్ర (16), గురులక్ష్మి(10)లు ఉన్న‌ట్లు స్థానికులు గుర్తించారు. కుటుంబంలో మొత్తం ఐదుగురు స‌భ్యులు ఉండగా, రెండో కుమార్తె ప్రసన్న కడప జిల్లా ప్రొద్దుటూరు ఉషోదయ పాఠశాలలో చదువుతున్న‌ట్లు స‌మాచారం. ఈ తీవ్ర విషాద ఘ‌ట‌న నిన్న (గురువారం) అర్థ‌రాత్రి స‌మ‌యంలో జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది.

Tragedy in Nandyala Four people died After Slab Collapsed

అయితే, శుక్ర‌వారం తెల్ల‌వారుజామున ఈ విష‌యాన్ని గ‌మ‌నించిన స్థానికులు శిథిలాల‌ను తొల‌గించి చూడ‌గా అప్ప‌టికే కుటుంబంలోని న‌లుగురు మృతిచెందారు. ఒకే కుటుంబానికి చెందిన న‌లుగురు స‌భ్యులు చ‌నిపోవ‌డంతో ఆ గ్రామంలో తీవ్ర విషాదం నెల‌కొంది.

Tragedy in Nandyala Four people died After Slab Collapsed

గ్రామ‌స్థులంతా క‌న్నీరుమున్నీరుగా విల‌పిస్తున్నారు. విష‌యం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘ‌టన స్థలానికి చేరుకుని మృతిదేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం ప్ర‌భుత్వాసుప‌త్రికి తీసుకెళ్లారు. ఇక‌, ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసి దర్యాప్తు చేస్తున్న‌ట్లు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+