దేవరగట్టు నెత్తుటి క్రీడకు భక్తులు బలి
దసరా పండగ వేళ కర్నూలు జిల్లాలో దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని హొళగుంద మండలంలో ప్రతి విజయదశమి నాడు సంప్రదాయబద్ధంగా నిర్వహించే దేవరగట్టు బన్ని ఉత్సవంలో ఇద్దరు భక్తులు దుర్మరణం పాలయ్యారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.
ప్రతి విజయదశమి నాడు దేవరగట్టు కొండపై వెలిసిన మాళమాళ మల్లేశ్వరస్వామి ఆలయం వద్ద సంప్రదాయబద్ధంగా ఈ బన్నీ ఉత్సవం జరుగుతూ వస్తోన్న విషయం తెలిసిందే. ఆనవాయితీ ప్రకారం ఈ విజయదశమి నాడు అర్ధరాత్రి మాాళ మల్లేశ్వర స్వామి, అమ్మవారి వివాహ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. అనంతరం ఊరేగింపు చేపట్టారు. ఈ సమయంలో దేవతామూర్తుల విగ్రహాలను తీసుకెళ్లడానికి రెండు వర్గాలు తలపడ్డాయి. కర్రలతో దాడులు చేసుకున్నాయి.

సంప్రదాయబద్ధంగా సాగాల్సిన ఈ దాడులు అదుపు తప్పాయి. హింసాత్మకంగా మారాయి. దేవతామూర్తులను తీసుకెళ్లే విషయంలో భక్తులు రాజీపడలేదు. పరస్పరం కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో మొత్తం ముగ్గురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. సుమారు 100 మందికి పైగా భక్తులు గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆదోని ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.
దేవరగట్టులో కర్రల సమరంలో మొత్తం ఏడు గ్రామాలకు చెందిన భక్తులు పాల్గొన్నట్లు పోలీసులు వెల్లడించారు. నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామాల భక్తులు ఒకవంక- సుళువాయి, అరికెర తండా, అరికెర, బిలేహాల్, ఎల్లార్తి, కురుకుంద, విరుపాపురం గ్రామాల భక్తులు మరోవంక ఈ కర్రలతో తలపడ్డారని వివరించారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, పత్తికొండ ఆర్డీవో భరత్ నాయక్ ఆరా తీశారు. పరిస్థిని పర్యవేక్షిస్తున్నారు.












Click it and Unblock the Notifications